స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ జీవితం అన్ని భిన్నమైనవి. సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో ఇబ్బంది పడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. తను ఏ విషయాన్ని అయినా డిఫరెంట్ గా ఆలోచించి తన జీవితాన్ని తనకు నచ్చినట్టుగా జీవించాలని కోరుకుంటుంది. సొసైటీ కోసం తను బ్రతకడం అనేది తన కాన్సెప్ట్ లోనే లేదంటు కచ్చితంగా చెప్పింది. సమంతా కు ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా కేవలం తన టాలెంట్ తోనే టాప్ హీరోయిన్ రేంజ్ లోకి వెళ్ళింది సమంత. నాగ చైతన్యతో ప్రేమ వివాహం చేసుకొని ఆ తరువాత కొన్ని విభేదాల కారణంగా వాళ్ళు
ఇద్దరు విడాకులు తీసుకోవడం వల్ల ఆమెను మరింత కృంగదీశాయి. ఆ క్రమంలోనే తనపై ఎన్నో ఆరోపణలు,నిందలు చేశారు. ఆమెపై సోషల్ మీడియా ట్రోల్స్ చేసింది. ఇక దానితో ఆమె మానసికంగా ఒత్తిడికి గురైంది. ఒక వర్గం సమంతా పై కావాలనే టార్గెట్ చేస్తుందని వాదన వినిపిస్తోంది. ఇవన్నీ ఇలా ఉండగా ఇప్పుడు వీటన్నిటికీ తోడు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధినీ భరిస్తోంది ఆమె. సినిమాలకు కూడా బ్రేక్ ఇచ్చి ఏడాదికాలంగా ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటు ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటుంది సమంత. 36 సంవత్సరాలు ఇప్పుడు సమంతాకు. ఆమె తల్లిదండ్రులు సమంతాకు విడాకుల తర్వాత ఒంటరిగానే ఉంటుంది అని పెళ్లి చేసుకో మని కోరుతున్నారు.
ఇవన్నీ ఇలా ఉండగా ఇంకో విషయానికి వస్తే సమంతాకు తల్లి కావాలని కోరిక బలంగా ఉందంట. సమంత ఇద్దరూ పిల్లలను దత్తత తీసుకోవాలని ఆలోచనలో ఉందని తెలుస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ విషయం చెక్కర్లు కొడుతోంది. ఈ విషయానికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినా ఆమె తల్లి కావాలనుకుంటుందని వార్తలు మాత్రం సోషల్ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఇక సమంత 2014 నుండి ప్రత్యూష సపోర్ట్ పేరుతో ఒక చారిటీ సంస్థ నడుపుతోంది. ఆమె నడుపుతున్న ఈ సంస్థ తరుపున మహిళల కు మరియు ఆడపిల్లల సంక్షేమానికి కృషి చేసేందుకు. కాబట్టి తను పిల్లలను దత్తత తీసుకొని అమ్మ అవ్వాలని కోరిక తీర్చుకోవాలని భావిస్తోంది. ఇక ఈ విషయంపై ప్రచారం జరుగుతోంది..!!