ఆ "ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ లేటెస్ట్ మూవీ..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో ఒకరు అయినటువంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ నటుడు వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన అల్లుడు శీను మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సమంత హీరోయిన్ గా నటించగా ...  దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇకపోతే ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.


మూవీ తో ఈ నటుడు కి మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఇకపోతే ఈ మూవీ తర్వాత అనేక తెలుగు సినిమాలలో నటించిన ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీ లో పరవాలేదు అనే స్థాయి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇలా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు గల నటుడుగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్న సమయం లోనే ఈ నటుడు హిందీ సినీ పరిశ్రమపై దృష్టి పెట్టాడు. అందులో భాగంగా తెలుగులో బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన చత్రపతి మూవీ ని హిందీ లో రీమేక్ చేశాడు.


ఇకపోతే ఈ మూవీ కి వి వి వినాయక్ దర్శకత్వం వహించాడు. కొంత కాలం క్రితమే హిందీ భాషలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను తీవ్ర నిరాశపరిచింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయిన ఈ సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించలేకపోయిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: