మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ "ఆర్ ఆర్ ఆర్"
మూవీ తో గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ తర్వాత చరణ్ ...
మెగాస్టార్ చిరంజీవి హీరోగా
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య అనే సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ చరణ్ ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. ఇక ఈ
మూవీ తర్వాత చరణ్ ...
శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న
గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
కియార అద్వానీ ఈ
మూవీ లో
హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ...
ఎస్ జె సూర్య ఈ
మూవీ లో విలన్ పాత్రలో నటిస్తున్నాడు.
తమన్ సంగీతం అందిస్తున్న ఈ
మూవీ ని దిల్ రాజు నిర్మిస్తూ ఉండగా ...
అంజలి ,
సునీల్ ,
శ్రీకాంత్ ఈ
మూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇకపోతే ఈ
మూవీ షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ అయినప్పటికీ ఈ
సినిమా యొక్క చిత్రీకరణ మాత్రం చాలా స్లోగా జరుగుతూ వస్తుంది. దీనికి కారణం ఈ
సినిమా షూటింగ్ తో పాటు
శంకర్ "ఇండియన్ 2"
మూవీ షూటింగ్ ను కూడా ఏకకాలంతో పూర్తి చేస్తూ వస్తుండడంతో ఈ
సినిమా షూటింగ్ డిలే అవుతూ వస్తుంది.
ఇకపోతే తాజాగా ఈ రోజు నుండి ఈ
మూవీ యొక్క లేటెస్ట్ షెడ్యూల్ మైసూర్ లో స్టార్ట్ కాబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన చాలా కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే చరణ్ ...
శంకర్ కాంబోలో రూపొందుతున్న
మూవీ కావడంతో ఈ
మూవీ పై
ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నిలకొని ఉన్నాయి.