కోలీవుడ్ అగ్ర హీరో మాధవన్ తాజాగా' ది రైల్వే మెన్అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఈ వెబ్ సిరీస్ లో ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ జుహీ చావ్లాఓ కీలక పాత్ర పోషించింది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాధవన్ మాట్లాడుతూ.." అదృష్టం బాగుండి ఈ సిరీస్ కి జూహీ చావ్లా ఓకే చెప్పారు. ఇక్కడ మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. 'ఖయామత్ సే ఖయామత్ తక్'సినిమా చూసినప్పుడు నేను ఈ హీరోయిన్ పెళ్లి చేసుకుంటానని అమ్మతో చెప్పాను. అప్పుడు నాకున్న ఏకైక లక్ష్యం ఆమెను పెళ్లి చేసుకోవడమే" అని అన్నాడు. అంతేకాకుండా 'రైల్వే మెన్'
సిరీస్ లో జుహీ చావ్లాతో కలిసి
పనిచేసే అవకాశం తనకు రాలేదని, ఎందుకంటే తన భాగానికి సంబంధించిన షూట్ అయిపోయిన తర్వాతే జూహి చావ్లా ఈ సిరీస్ లో భాగం అయ్యారని ఈ సందర్భంగా తెలిపాడు మాధవన్. కాగా 1988లో 'ఖయామత్ సే ఖయామత్ తక్' సినిమా రిలీజ్ అయింది. అప్పటికీ మాధవన్ తన సినీ కెరీర్ ని ప్రారంభించనేలేదు. 1993లో 'బనేగి అప్ని బాత్'అనే టీవీ షో ద్వారా మాధవన్ తొలిసారి స్క్రీన్ పై కనిపించాడు. ఆ తర్వాత కొన్ని టీవీ షోలో పాటిస్పేట్ చేశాడు. 1997లో 'ఇన్ ఫెర్నో' అనే సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చి తమిళం తో
పాటు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళం,
కన్నడ భాషల్లో నటించి వర్సటైల్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 1999లో సరిత బిర్జీ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మాధవన్ నటించిన పలు సినిమాలకి ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేయడం విశేషం. ఇక 'ది రైల్వే మెన్వెబ్ సిరీస్ విషయానికొస్తే.. 1984 భోపాల్లో జరిగిన గ్యాస్ లీక్ సంఘటన ఆధారంగా ఈ సిరీస్ ని తెరకెక్కించారు.