అమాయక చూపులతో టెంప్ట్ చేస్తున్న 'ఓజి' బ్యూటీ....!!
కానీ 'స్పై' చిత్రంతో పెద్దగా హిట్ అందుకోలేకపోయింది. కానీ ఈ బ్యూటీ ఇచ్చి న పెర్ఫామెన్స్ కు అవకాశాలు మాత్రం అందుకుంటోంది. ఇప్పటికే మలయాళంలో 'బజూక' చిత్రంలో నటిస్తోంది. తెలుగులో మరో బంపర్ ఆఫర్ అందుకుంది.ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రంలోనే అవకాశం దక్కించుకుంది. యంగ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుజీత్ డైరెక్ట్ చేస్తున్న OG మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.తెలుగులో ఒక్క హిట్ పడితే మాత్రం ఐశ్వర్య మీనన్ రేంజ్ మరోలా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఆఫర్లు అందుకుంటోంది. సరైన హిట్ ఉంటే అవకాశాలు జోరుగా వచ్చే అవకాశం లేకపోలేదు. పవన్ కళ్యాణ్ 'ఓజీ' తర్వాత ఆ స్టేజ్ దక్కుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.ఈక్రమంలో ఐశ్వర్య మీనన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే కనిపిస్తోంది. బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది. తాజాగా వైట్ చుడీదార్ లో ఈ ముద్దుగుమ్మ మత్తుగా ఫోజులిస్తూ అట్రాక్ట్ చేసింది. తనదైన రీతిలో ఫొటోలకు ఫోజులిస్తూ ఆకట్టుకుంది. తాజా ఫొటోస్ కూడా నెట్టింట వైరల్ గా మారాయి.