రౌడీ హీరోను అణిచివేయాలని చూస్తున్న స్టార్స్...!!

murali krishna
సినిమా ఇండస్ట్రీలో ఏ సపోర్ట్ లేకుండా ఈ జనరేషన్ లో మంచి హీరోగా ఎదుగుతున్న వాళ్లలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి అనే రెండు సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు.మరి ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమాతో అయితే ఆయన ఓవర్ నైట్ లో స్టార్ హీరో అయిపోయాడు.ఇక ఆ సినిమా ఇచ్చిన జోష్ తో వెనక్కి తిరిగి చూడకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఇక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.అయితే విజయ్ దేవరకొండ అతి తొందరలో స్టార్ హీరోగా ఎదుగబోతున్నాడు అని తెలిసిన తెలుగు సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది స్టార్ హీరోలు కలిసి అతన్ని ఎదగకుండా చేస్తున్నారు అనే టాక్ అయితే బయట బాగా వినిపిస్తుంది. నిజానికి విజయ్ దేవరకొండ కొంచెం అతి చేస్తూ మాట్లాడతాడు అనేది ఆయన స్పీచ్ లో మనం తరచూ చూస్తూ ఉంటాం… ఎందుకంటే ఆయన స్టేజ్ ఎక్కినప్పుడు తనకు నచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు అది కొంతమందికి నచ్చదు. అందువల్లే విజయ్ దేవరకొండని చాలామంది దూరం పెడుతూ ఉంటారని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే ఉంది. అయితే తను ఎందుకు అలా మాట్లాడతాడు అంటే లోపల ఒకటి పెట్టుకొని, బయటికి ఇంకొకటి మాట్లాడటం తనకి నచ్చదని తన సినిమాలు చూస్తూ తనని ఆదరిస్తున్న జనాల దగ్గర చాలా ఓపెన్ గా ఉండాలనే ఉద్దేశ్యం తోనే తను అలా మాట్లాడతాడని అప్పట్లో తను క్లారిటీ కూడా ఇచ్చాడు.
అయితే విజయ్ ఎదిగితే వేరే హీరోలకి ప్రాబ్లం అవుతుందనే ఉద్దేశ్యం తోనే తనని ఎదగకుండా చేస్తున్నారు అని టాక్ అయితే ఇండస్ట్రీలో బాగా వినిపిస్తుంది.ఇక నిజానికి ఏ హీరో అతన్ని తొక్కేయాలని చూసిన చూడకపోయిన కూడా తను ఎంచుకున్న కథల్లో దమ్ముంటే ఆ సినిమాలు ఆటోమేటిక్ గా మంచి సక్సెస్ సాధిస్తాయి. ఆయన కరెక్ట్ సినిమాలను ఎంచుకొని వరుసగా హిట్లు కొడితే ఏ స్టార్ హీరోస్ అయిన ఆయనని ఎంత తొక్కాలని చూసినా కూడా తొక్కడం ఎవరి వల్ల కాదు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.మొత్తానికి విజయ్ దేవరకొండని ఎవరు తొక్కాల్సిన పనిలేదు ఎందుకంటే తను మాట్లాడిన ఓవర్ మాటల వల్ల తనకు తానే కొంతమంది ఆడియన్స్ లో బ్యాడ్ అయిపోతున్నాడు. ముందుగా ఇక్కడ ఎదగాలి అంటే ఎవరైనా ఆటిట్యూడ్ తగ్గించుకొని అందరిని కలుపుకుంటు ముందుకు దూసుకెళ్తుంటే జనం వాళ్ళంతట వాళ్లే మనకు అభిమానులుగా మారిపోతారు అంటూ ట్రేడ్ పండితులు సైతం విజయ్ దేవరకొండ కి సలహాలను ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: