ఆ కారణంగా ముంబై చేరిన మంచు లక్ష్మి...!!
రీసెంట్‌గా ఓ నేషనల్ మీడియాతో ముచ్చటించిన ఆమె మాట్లాడుతూ.. ‘పదేళ్లు ముంబైలో ఉన్నా. అక్కడ నేను అందరికి తెలుసు. బయటకు వెళితే ఫ్యాన్స్ కళ్లు అన్ని నాపైనే ఉంటాయి. కానీ ఇక్కడ నేను కెరీర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. నిజానికి ఇలాంటి ఛాలేంజెస్ అంటే నాకు ఇష్టం. ఎప్పుడు ఒకేచోట ఉంటే నాకు బోర్ కోడుతుంది. ఇక్కడ నన్ను నేను కొత్త పరిచయం చేసుకోవాల్సి ఉంంటుంది’ అని చెప్పింది. ఆ తర్వాత ‘హైదరాబాద్‌లో నాతో పాటు నా తమ్ముడు (మనోజ్) ఉండేవాడు. తన పెళ్లి అయిపోయాక వెళ్లిపోయాడు.
ఆ తర్వాత నాకు లోన్లీ ఫీలింగ్ వచ్చింది. అదే టైంలో ఒకసారి నా ఫ్రెండ్ రానాకి(హీరో దగ్గుబాటి రానా) ఫోన్ చేశాను. అతడు తన బిజినెస్ గురించి చాలా సిరీయస్‌గా మాట్లాడుతున్నారు. అప్పుడు నాకు భయం వేసింది. నేను ఏంటీ? ఎక్కడ ఉన్నాను? అని నన్ను నేను ప్రశ్నించుకున్నాను. అప్పుడే నేను హైదరాబాద్ వదిలే టైం వచ్చిందని డిసైడ్ అయ్యా. అలా ముంబై వచ్చాను’ అని తెలిపింది. ఇక ముంబై ఇల్లు దొరకడం చాలా కష్టమని, రకుల్ ప్రీత్ సింగ్ వల్ల తనకు ఆ పని చాలా ఈజీ అయిపోందని చెప్పింది. తన కోసం రకుల్ దాదాపు 100 అపార్టుమెంట్స్ చూసి పెట్టిందని, తాను ముంబై వచ్చాక వారం రోజులకు అందులో బెస్ట్ సెలక్ట్ చేసుకున్నానంటూ మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది.