ప్రభాస్... హను రాఘవపూడి కాంబో మూవీలో హీరోయిన్ గా ఆ క్రేజీ బ్యూటీ..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ కి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో భాగంగా ఈ మూవీ మొదటి భాగం షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన రెండవ భాగం షూటింగ్ ను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని ఈ సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది.


ఇకపోతే ఈ సినిమాతో పాటు ప్రభాస్ ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రాజెక్ట్ కే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ మూవీ తో పాటు మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కూడా ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్నాడు. ఇలా ప్రస్తుతం మూడు మూవీ ల షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్ మరి కొన్ని రోజుల్లోనే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందబోయే స్పిరిట్ అనే సినిమాలో కూడా హీరోగా నటించబోతున్నాడు.


ఇకపోతే కొంతకాలం క్రితమే దర్శకుడు హను రాఘవపూడి ... ప్రభాస్ కి ఓ కథ వినిపించినట్లు ఆ కథ అద్భుతంగా నచ్చడంతో హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో నటించడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం వీరి కాంబో మూవీ కి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో హను రాఘవపూడి ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేసినట్లు అందులో భాగంగా ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా ప్రియాంక అరుల్ మోహన్ ను హీరోయిన్ గా ఎంపిక చేసుకునే ఆలోచనలో ఈ దర్శకుడు ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: