సూర్య రియాలిటీ గురించి.. షాకింగ్ విషయం బయటపెట్టిన జ్యోతిక?
వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఎలాంటి విభేదాలు లేకుండా ఎవరి కెరియర్ లో వారు బిజీగా కొనసాగుతూ ఉన్నారు. అటు కుటుంబ బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న జ్యోతిక.. తన భర్త సూర్య రియాలిటీ గురించి చెప్పుకొచ్చింది. మమ్ముట్టి, జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన ఖాతాల్ ది కోర్ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది జ్యోతిక. ఈ క్రమంలోనే సూర్యతో ప్రేమ పెళ్లి గురించి కూడా ఓపెన్ అయింది.
ఎవరైనా ప్రేమలో పడటం సులభం. కానీ ఆ ప్రేమలో ఎదగడాన్ని మాత్రం మర్చిపోకూడదు. మన భాగస్వామిని గౌరవించడం, అభినందించడం దాంపత్య జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. పరస్పర గౌరవం ప్రశంసల పై ఆధారపడి ఉంటుంది. ఒక బంధం లో ఉన్నప్పుడు చిన్న విషయాలను పట్టించుకోకూడదు. సూర్య, నేను కలిసి ఏడు చిత్రాలలో నడిచాం. అతడు అందరికీ మర్యాదనిస్తాడు. అలాగే నా భావాలను గౌరవిస్తాడు. నాకు నచ్చే విషయం అదే. అందుకే సూర్య నాపై ఉన్న ప్రేమను బయట పెట్టగానే అంగీకరించాను. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉన్న అంటూ జ్యోతిక చెప్పుకొచ్చింది.