స్టైలిష్ స్టార్ సినిమా విషయంలో అలా జరిగిందా....??
అలా అల్లు అర్జున్ కెరీర్ లో మొట్టమొదటి సినిమాగా గంగోత్రి విడుదల అయింది. అయితే ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ కి ఏ విధంగానూ ఉపయోగపడలేదు. నటన పరంగాను, లుక్స్ పరంగా చాలా ట్రోల్ జరిగింది అల్లు అర్జున్ పై. కానీ కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా కథను చిన్ని కృష్ణ ఎక్కడి నుంచి తీసుకున్నాడు అనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. అవకాశాల కోసం కథలు పట్టుకొని తిరుగుతున్న ఒక చిన్న రైటర్ దగ్గర నుంచి మొదట చిన్నికృష్ణ ఈ సినిమా కథలో తీసుకున్నాడటలో చెప్పగా అల్లు అరవింద్ ఓకే చేశాడు. కానీ ఆ రైటర్ కి డబ్బులు ఇవ్వకుండా ఆ చిన్నికృష్ణ మాత్రం అల్లు అరవింద్ దగ్గర నుంచి భారీగానే డబ్బులు తీసుకున్నాడట.ఈ విషయం అప్పట్లో గొడవకు దారితీసింది. విషయం తెలిసిన దర్శక నిర్మాతలు ఆ వ్యక్తిని పిలిపించి గొడవ కాకుండా కొంత డబ్బు పంపించారట. ఇలా చాలామంది అవకాశాల కోసం తిరిగే రైటర్స్ దగ్గర స్టోరీలను దొంగతనం చేయడం కొంతవరకు జరుగుతున్నప్పటికీ చిన్ని కృష్ణ లాంటి ఒక పెద్ద దర్శకుడు ఇలా చేయడం మాత్రం నిజంగా బాధాకరం.