కుర్రోళ్లను అల్లకల్లోలం చేస్తున్న జబర్దస్త్ బ్యూటీ....!!
సుధీర్ లేకపోవడంతో రష్మి కూడా ఒంటరైన ఫీలింగ్ కలుగుతుంది. వీరిద్దరి కాంబినేషన్‌లో చూసిన కళ్లు ఒంటరిగా చూస్తే ఏదో లోటు కనిపిస్తుంది. అందుకే మళ్లీ సుధీర్ జబర్దస్త్ కి రావాలని కోరుకుంటున్నారు. ఆ డిమాండ్ వినిపిస్తూనే ఉంది.ఇక అయితే సుధీర్ అనే ఇమేజ్ నుంచి తాను బయటపడేందుకు రష్మి ప్రయత్నిస్తుంది. తాను సొంతంగా రాణించాలని భావిస్తుంది. ఒంటరిగానే తాను అలరిస్తుంది. అందుకు తన గ్లామర్ ట్రీట్‌ని కూడా యాడ్ చేస్తుంది.గతంలోనూ వరుసగా ఫోటో షూట్లతో అందాల విందు ఇచ్చే రష్మి ఇటీవల తగ్గించింది. కానీ ఏదో రూపంలో ఇస్తూనే ఉంది. తాజాగా ఈ బ్యూటీ వైట్ డ్రెస్‌లో మెరిసిపోయింది. అందాల దేవతలా కనిపిస్తుంది. ఆకాశంలో ఉండే అప్సరస దారి తప్పి నేలపైకి వచ్చిందా అనేట్టుగా మారింది.
అంతేకాదు వైట్ డ్రెస్‌లో జబర్దస్త్ రష్మి అందం మరింత పెరిగిపోయింది. ఇంకా చెప్పాలంటే చూడ్డానికి రెండు కళ్లు సరిపోవడం లేదు. దీంతో నెటిజన్లు అల్లకల్లోలం అవుతున్నారు. ఆమె అందానికి ఫిదా అవుతున్నారు.అందమంటే స్కిన్ షో కాదు, నిండైన దుస్తుల్లోనూ అందంగా ఎలా ఉండాలో చెప్పేందుకు రష్మి గౌతమ్ లేటెస్ట్ ఫోటో షూట్ ఓ ఉదాహరణగా చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ బ్యూటీ గ్లామర్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి.ఇక యాంకర్‌గా రష్మి గౌతమ్ బిజీగా ఉంది. ఆమె ఓ వైపు `జబర్దస్త్` కామెడీ షోని, మరోవైపు `శ్రీదేవి డ్రామా కంపెనీ`ని హోస్ట్ చేస్తూ రాణిస్తుంది. వారానికి రెండు సార్లు మెరుస్తూ అలరిస్తుంది.