యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటి భాగాన్ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ తర్వాత ఈ సినిమా రెండవ భాగం షూటింగ్ ను కూడా పూర్తి చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ మొదటి భాగం పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ సినిమా "వార్ 2" షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. ఈ మూవీ లో హృతిక్ రోషన్ హీరోగా నటించనున్నాడు.
ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ యొక్క మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమా రెండవ భాగంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రే అయినప్పటికీ ఈ పాత్ర చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు కథ మొత్తం ఈ పాత్ర ద్వారానే మలుపు తిరగబోతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే తాజాగా "వార్ 2" మూవీ లో ఎన్టీఆర్ కి జోడిగా నటించబోయే హీరోయిన్ కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అసలు విషయం లోకి వెళితే ... హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న శర్వరి వాగ్ "వార్ 2" మూవీ లో ఎన్టీఆర్ కి జోడిగా నటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ నటి సినీరంగంలోకి సహాయ దర్శకురాలిగా అడుగుపెట్టి 2020 లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన వెబ్ సిరీస్ ది ఫర్గాటెన్ ఆర్మీ - ఆజాదీ కే లియేతో తన నటన రంగంలోకి వచ్చింది. 2021 లో బంటీ ఔర్ బబ్లీ 2 మూవీ తో సినీ రంగంలోకి అడుగు పెట్టింది. వార్ 2 మూవీ లో నిజంగా ఈ బ్యూటీ కి ఆఫర్ వచ్చినట్లు అయితే ఈ నటి క్రేజ్ మరింతగా పెరిగే అవకాశం ఉంది.