ఆ స్టార్ హీరోలతో సినిమా చేయాలని ఉంది... సందీప్ రెడ్డి..!

Pulgam Srinivas
అర్జున్ రెడ్డి ... కబీర్ సింగ్ మూవీ లకు దర్శకత్వం వహించి ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగ తాజాగా యానిమల్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. రన్బీర్ కపూర్ హీరో గా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ డిసెంబర్ 1 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం సందీప్ వరుస ఇంటర్వ్యూ లలో ... టాక్ షో లలో పాల్గొంటూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న సందీప్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.


తాజా ఇంటర్వ్యూ లో భాగంగా సందీప్ మాట్లాడుతూ ... నేను మహేష్ బాబు గారితో ఒక సినిమా చేయాలి అనుకున్నాను. అందులో భాగంగా ఆయనకు కథ ను కూడా వినిపించాను. నేను చెప్పిన కథ ఆయనకు చాలా బాగా నచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా సెట్ కాలేదు అని చెప్పుకొచ్చాడు. ఇక నేను నా తర్వాత రెండు సినిమాలను ప్రభాస్ మరియు అల్లు అర్జున్ లతో చేయబోతున్నాను. ఆ తర్వాత మహేష్ బాబు ... రామ్ చరణ్ మరియు కొంత మంది ఇతరులతో కూడా సినిమా చేయాలి అని నాకు ఉంది అని చెప్పుకొచ్చాడు.


ఇకపోతే రెండు వరుస విజయాల తర్వాత సందీప్ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో యానిమల్ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా ఏ రేంజ్  విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుందో చూడాలి. ఇకపోతే తాజాగా యానిమల్ మూవీ ట్రైలర్ ను ఈ చిత్ర బృందం విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: