న్యాచురల్ స్టార్
నాని హీరోగా కొత్త దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహించిన పాన్
ఇండియా చిత్రం హాయ్ నాన్నా. వైరా ఎంటర్టైన్మెంట్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ
సినిమా డిసెంబర్ 7 వ తేదీన విడుదల కానుంది.ఇక ఇప్పటికే టీజర్ సాంగ్స్ ద్వారా మంచి హైప్ క్రియేట్ చేసుకున్న ఈ
సినిమా ఇప్పుడు ట్రైలర్ ద్వారా కూడా మరింత బజ్ క్రియేట్ చేసుకుంది. ట్రైలర్ చూసినట్లయితే దర్శకుడు పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్కు సంబంధించిన అన్ని అంశాలను హైలెట్ చేశాడు. రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు భిన్నంగా కథను చాలా కొత్త తరహాలో అందించాడని పూర్తిగా అనిపిస్తుంది.ఇక
దసరా సినిమాలో
మాస్ క్యారెక్టర్ చేసిన
నాని ఇప్పుడు పూర్తిగా ఫ్యామిలీ మ్యాన్ పాత్రలో కనిపించడం విశేషం. పాపకు తండ్రిగా ఇంకా ప్రేమికుడుగా ఇందులో విభిన్నమైన ఎమోషన్స్ ను చూపిస్తున్నాడు. ఇక కూతురు ప్రేయసి ఇలా ఇద్దరి మధ్యలో ఉన్న ప్రేమలో హీరోకు వచ్చిన సమస్య ఏమిటి? అనే అంశాలు సినిమాపై చాలా ఆసక్తిని పెంచుతున్నాయి.
అలాగే సినిమాలో ఎమోషన్స్ కు తగ్గట్టుగా హేషామ్ అబ్దుల్ వహాబ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరింత హైలెట్ అవుతోంది. వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు కూడా అద్వితీయంగా ఉన్నాయి. మొత్తం మీద హాయ్ నాన్నా
సినిమా ట్రైలర్ డిఫరెంట్
హార్ట్ టచింగ్ ఎమోషన్స్ తో హైలెట్ అయ్యింది.
మోహన్ చెరుకూరి (CVM) ఇంకా
డాక్టర్ విజయేందర్
రెడ్డి తీగల ఈ సినిమాని చాలా గ్రాండ్ గా భారీ బడ్జెట్తో నిర్మించారు. హాయ్ నాన్నా
సినిమా డిసెంబర్ 7న తెలుగు, తమిళం,
కన్నడ, మలయాళం,
హిందీ భాషల్లో విడుదల కానుంది.అయితే ఈ
సినిమా మరో రెండు భారీ బడ్జెట్ పాన్
ఇండియా సినిమాలతో పోటీ పడుతుంది. అందులో ఒకటి
బాలీవుడ్ స్టార్
హీరో రన్ బీర్ కపూర్ ఇంకా
టాలీవుడ్ స్టార్
డైరెక్టర్ సందీప్
రెడ్డి వంగా కాంబినేషన్ లో వస్తున్న యానిమల్
సినిమా కాగా ఇంకోటి పాన్
ఇండియా స్టార్
ప్రభాస్ ఇంకా
కన్నడ స్టార్
డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సలార్. ఈ సినిమాలు కూడా
డిసెంబర్ నెలలోనే విడుదల కాబోతున్నాయి.పైగా వీటిపై అంచనాలు చాలా భారీగా ఉన్నాయి. మరి ఈ రెండు సినిమాలతో
నాని హాయ్
నాన్న పోటీ పడి భారీ వసూళ్లు రాబడుతుందో లేదో చూడాలి.