"యానిమల్" ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ... వేదిక ఖరారు..!

Pulgam Srinivas
బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ తాజాగా యానిమల్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించగా ... రష్మిక మందన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ఈ మూవీ ని డిసెంబర్ 1 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా బృందం ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేసింది. ఇకపోతే ఈ మూవీ ట్రైలర్ కు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా బృందం వారు ఈ మూవీ యొక్క ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తున్నారు.
 


అందులో భాగంగా ఈ చిత్ర బృందం ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూ లలో ... టీవీ షో లలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబందించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ రోజు అనగా నవంబర్ 27 వ తేదీన సాయంత్రం 5 గంటలకు మల్లారెడ్డి యూనివర్సిటీ ... దూలపల్లి ... హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు ఈ చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అన్ని కూడా సూపర్ గా ఉండడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: