రబ్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో యానిమల్ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని డిసెంబర్ 1 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా ఈ మూవీ బృందం విడుదల చేసింది. ఈ మూవీ ట్రైలర్ అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ మూవీ ట్రైలర్ కి ప్రస్తుతం ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. అలాగే ఈ మూవీ ట్రైలర్ సూపర్ గా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి.
ఇకపోతే తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నవంబర్ 27 వ తేదీన సాయంత్రం 5 గంటలకు మల్లారెడ్డి యూనివర్సిటీ ... దూలపల్లి ... హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు ... ఎస్ ఎస్ రాజమౌళి ముఖ్య అతిథులుగా రానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మహేష్ , రాజమౌళి ముఖ్య అతిథులుగా రానుండడంతో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పై కూడా ప్రేక్షకులు ఆసక్తిని చూపిస్తున్నారు.
ఇది ఇలా ఉంటే అర్జున్ రెడ్డి ... కబీర్ సింగ్ ఇలా రెండు మూవీ లకు దర్శకత్వం వహించి రెండింటితో కూడా అద్భుతమైన విజయాలను అందుకున్న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన మూవీ కావడం ... బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ ఈ సినిమాలో హీరోగా నటించడంతో ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.