అనిమల్ సునామీతో షేక్ అవుతున్న టాలీవుడ్ !

Seetha Sailaja
ఈవారం విడుదలకాబోతున్న ‘యానిమల్’ ఫీవర్ తో టాలీవుడ్ షేక్ అవుతోంది.  రోజురోజుకి ఈ సినిమా పై అంచనాలు పెరిగిపోతున్నాయి.    ఈ మూవీ ట్రైలర్ విడుదల అయ్యాక అంచనాలు మరింత పెరిగిపోయాయి. మొదట్లో ఈసినిమా నిడివి 3గంటల 21 నిమిషాలు అని  వార్తలు రాగానే ఇంత పెద్ద సినిమాను జనం చూస్తారా అన్న సందేహాలు  వ్యక్త పరిచిన వారికి ఈ మూవీ అడ్వాన్స్ టిక్కెట్స్ పెరుగుతున్న  డిమాండ్ చూసి షాక్ అవుతున్నారు.    

తెలుస్తున్న సమాచారంమేరకు ఈ మూవీ అడ్వాన్స్ టిక్కెట్స్ కు డిమాండ్ కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాలలోని అన్ని నగరాలలోను  కనిపిస్తోంది. క్రేజ్ ఉన్న మల్టీప్లెక్సుల్లో ఈ మూవీ టికెట్లు ఓపెన్ అవడం తరువాయి నిముషాలలో  ఫుల్ అవుతున్నాయి. తెలుస్తున్న సమాచారంమేరకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ సినిమా హక్కులను దిల్ రాజు 15 కోట్లకు తీసుకున్నట్లు   తెలుస్తోంది.

సాధారణ మార్కెట్ పరిస్థితులలో రణబీర్ కపూర్ సినిమాకు ఇది చాలా పెద్ద మొత్తం అని అంటున్నారు. అయితే సందీప్ రెడ్డి బ్రాండ్ పై ఉన్న   నమ్మకంతో దిల్ రాజ్ ఈమూవీ పై ఇంత భారీ మొత్తాన్ని పెట్టినట్లు  తెలుస్తోంది. డిసెంబర్ 1 ఏపీ తెలంగాణ వ్యాప్తంగా ముందురోజు రాత్రి ప్రీమియర్లతో ఈ మూవీ మ్యానియాను మరింత పెంచాలని దిల్ రాజ్ పక్కా ప్లాన్ అని అంటున్నారు.

ఈ మూవీకి యావరేజ్ టాక్ వచ్చినా మరో సినిమా పోటీ లేకపోవడంతో  పాటు గత నెల రోజులుగా సరైన భారీ సినిమా విడుదల కాకపోవడంతో ఈ మూవీ మొదటివారం కలెక్షన్స్  రికార్డులు క్రియేట్ చేస్తుందని దిల్ రాజ్ అంచనా అంటున్నారు. ఒకవేళ అనుకోకుండా ఈ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే చాలు దిల్ రాజ్ కు కాసుల వర్షం కురియడం ఖాయం  అన్న అంచనాలు వస్తున్నాయి. ఒక హిందీ సినిమాకు తెలుగు  రాష్ట్రాలలో ఈమధ్య రాలేదు అన్న అభిప్రాయాలు  వ్యక్తం అవుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: