ఆ సినిమాతో ట్రాక్ తప్పిన శ్రీ లీల.. ఫ్యాన్స్ కి భారీ షాక్..!?

Anilkumar
భగవంత్ కేసరి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది శ్రీ లీల. ఇక దాని తర్వాత వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది. అయితే ధమాకా హిట్ సినిమాతో ఒకేసారిగా 8 మూవీల దాకా ఓకే చెప్పేసింది శ్రీ లీల. అయితే ఆ సినిమాలలో ఆమె కెరీర్ కు ఏది ఫ్లాప్ అవుతుందో ఊహించలేకపోయింది. రామ్ మరియు శ్రీ లీల స్కంద చేసిన సినిమా ఫెయిల్యూర్ కాస్త డిసప్పాయింట్ చేసిన కూడా భగవంత్ కేసరి లో బాలకృష్ణ కూతురుగా నటించి మంచి హిట్ ను సాధించి బ్యాలెన్స్ చేసుకుంది. ఇక సినిమాలో శ్రీ లీల నటించిన పాత్ర అభిమానులకి నచ్చేసింది. 


అయితే ఈ సినిమా హిట్ అయింది కదా అనుకునే లోపే ఆదికేశవ సినిమాతో మరోసారి ట్రాక్ తప్పేసింది ఈమె. ఇక శ్రీ లీల ఖాతాలో మరో మూవీ పడింది. అయితే వైష్ణవ తేజ్ మరియు శ్రీ లీల ఇద్దరు జంటగా నటించిన ఆదికేశవ సినిమాను శ్రీకాంత్ ఎం రెడ్డి డైరెక్టర్ నిర్మించారు. ఇక ఈ సినిమా విషయంలో మొదటి నుంచి డౌట్ గానే ఉండగా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఊహించినట్టుగానే ఈ సినిమా దెబ్బతీసింది. అయితే భగవంత్ కేసరి సినిమాతో మంచి హిట్ తో జోష్ మీద ఉన్న శ్రీ లీల దాని తర్వాత ఆదికేశవ సినిమా ఫ్లాప్


అవ్వడంతో మళ్ళీ డిలా పడిపోయింది. ఇక నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ తో డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది శ్రీ లీల. శ్రీ లీల మళ్లీ ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కుతుందేమో చూడాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలో కూడా శ్రీ లీల నటిస్తోంది. ఇక ఈ రెండు సినిమాలు శ్రీ లీల ను హిట్ ని డిసైడ్ చెప్పొచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: