పవన్ కళ్యాణ్ ని నాకంటే బాగా వాడుకున్నా వాళ్ళు ఉన్నారు.. నాకు ఆ ఉద్దేశ్యం లేదు : నితిన్

Anilkumar
టాలీవుడ్ రచయిత వక్కంతం వంశీ లాంగ్ గ్యాప్ తర్వాత దర్శకత్వం వహిస్తూ నితిన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్'. నితిన్ ఇందులో సరికొత్త మేకోవర్ లో కనిపించబోతున్నాడు. యంగ్ బ్యూటీ శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. డిసెంబర్ 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ ని ఏర్పరచుకుంది. అటు మూవీ టీం కూడా వరుస ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తున్నారు. 

ఈ క్రమంలోనే హీరో నితిన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా సినిమాలో కొన్ని సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ ని అనుకరించడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సినిమాలో తన క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ.." సినిమాలో నేను జూనియర్ ఆర్టిస్ట్ రోల్ ప్లే చేశాను. కానీ ఇందులో రియల్ లైఫ్ సినిమా కష్టాలు ఏమి చూపించలేదు. డే వన్ నుంచి మా ఎజెండా ఒక్కటే ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం. ఈ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేస్తారు" అంటూ చెప్పుకొచ్చాడు.

అనంతరం మీ సినిమాల్లో పవన్ కళ్యాణ్ ని వాడుకుంటున్నారనే విమర్శల గురించి ఏమంటారు? అని అడిగితే.." నేను పవన్ కళ్యాణ్ అభిమానిని ఆయన అభిమానిగా చెప్పుకోవడానికి ఎప్పుడూ వెనకాడలేదు. నేను ఆయన పేరుని వాడలేదు. నేను కావాలని నా సినిమాలో ఆయన పేరుని బలవంతంగా వాడలేదు. ఈ సినిమాలో కూలి గెటప్ లో ఓ సన్నివేశం ఉంది. అందుకే ఆయన స్టైల్ ని అనుకరించాల్సి వచ్చింది, తప్పితే మరో ఉద్దేశం లేదు" అని నితిన్ అన్నాడు. దీంతో నితిన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: