రెండో భార్యతో కూడా పృథ్వీరాజ్ కు బ్రేకప్ అయ్యిందా..!!

Divya
టాలీవుడ్ కోలీవుడ్ లో ఎన్నో విభిన్నమైన సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు నటుడు పృథ్వీరాజ్.. హీరోగా కొన్ని సినిమాలలో నటించి తనలో ఉండే టాలెంట్ తో యాక్టర్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా పలు సినిమాలలో నటించి మెప్పించారు. తమిళంలోనే చాలా సినిమాలలో నటించి మెప్పించిన పృథ్వీరాజ్ మొదట వడ్డే నవీన్ నటించిన పెళ్లి సినిమాలో సైకో భర్త పాత్రలో నటించడం జరిగింది. ఈ పాత్రకి మంచి మార్కులు పడడంతో ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో సహాయక పాత్రలలో కూడా నటించారు.


ఇటీవలే విడుదలైన బోయపాటి రామ్ స్కంద సినిమాలో కూడా ఒక కీలకమైన పాత్రలో నటించారు. బాలీవుడ్లో రణబీర్ కపూర్ నటించిన యానిమల్ సినిమాలో కూడా కనిపించడం జరిగింది. ఇదంతా ఇలా ఉండగా సినిమాలలో కంటే ఎప్పుడూ కూడా వివాదాలతో పృథ్వీరాజ్ నిరంతరం వార్తలలో నిలుస్తూ ఉంటారు. పృధ్విరాజ్ ఇటీవలే తనకన్నా 30 ఏళ్లు చిన్న వయసు కలిగిన అమ్మాయిని వివాహం చేసుకొని వార్తలలో నిలవడం జరిగింది. వీరి యొక్క వివాహం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.


1994లో వీణ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు ఆ తర్వాత విడాకులు ఇవ్వడం జరిగింది. కొంతకాలం ఒంటరిగా ఉన్న పృథ్వీరాజ్ ఇటీవలే రుక్మిణి శీతల్ అనే ఒక యువతీతో ప్రేమలో పడడం జరిగింది. చాలాకాలం వీరిద్దరూ డేటింగ్ లో ఉంటూ గత ఏడాది వివాహం చేసుకోవడం జరిగింది. వీరి వివాహం పైన ఎన్నో విమర్శలు కూడా వచ్చాయి. కానీ పెద్దగా స్పందించకుండా ధైర్యంగా వివాహం చేసుకున్నారు. అయితే ఇప్పుడు వీరిద్దరూ విడిపోతున్నారని వార్తలు కోలీవుడ్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఏడాది కాకుండా అని వీరిద్దరూ విడిపోతున్నారనే టాక్ రావడానికి ముఖ్య కారణం శీతల్ పృధ్విరాజ్ తనకు ప్రపోజ్ చేసిన వీడియోని సైతం సోషల్ మీడియాలో తొలగించడంతో ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: