ఓటిటి లో విడుదల కాబోతున్న జిగర్తాండ డబుల్ ఎక్స్..!!
సినిమా ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్స్ తెచ్చుకున్నప్పటికీ కానీ కమర్షియల్ గా సక్సెస్ను అందుకోలేకపోయింది... రాఘవ లారెన్స్, ఎస్ జె సూర్య ఇద్దరు కూడా తన యాక్టింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. సినీ ప్రముఖుల నుంచి ఈ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. ముఖ్యంగా ఈ సినిమా విడుదలైన సమయంలో స్టార్ హీరో ధనుష్ ట్విట్ చేస్తూ జిగర్తాండ డబుల్ ఎక్స్ సినిమా చూడడం జరిగింది.. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు నుంచి మరో సరికొత్త అద్భుతం జరిగింది అంటు తెలిపారు.
ఇక నటనపరంగా ఎస్జె సూర్య కూడా అద్భుతంగా నటించారని ఒక నటుడుగా రాఘవ లారెన్స్ ఎంతగానో మెప్పించారని తెలిపారు. సినిమా చివరిలో 45 నిమిషాలు తన మనసును ఆకట్టుకోవడం జరిగింది అంటూ చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. ధనుష్. అయితే ఇప్పుడు తాజాగా ఓటీటి లో ఈ సినిమా స్ట్రిమింగ్ అయ్యేందుకు సిద్ధమయ్యింది.. డిసెంబర్ 8వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో స్ట్రిమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా అన్ని భాషలలో అందుబాటులోకి రాబోతోంది.