ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో.. అలా జరుగుతుందని ఊహించలేదు : నానీ
అయితే ఏదైనా సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జరుగుతున్న సమయంలో ఇక ఆ మూవీకి సంబంధించిన ఎన్నో ఫోటోలు, వీడియోలు వెనకాల ఉండే స్క్రీన్ పై ప్రదర్శించడం చేస్తూ ఉంటారు అని చెప్పాలి. కానీ ఇటీవల నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం ఊహించని పరిణామం ఎదురయింది. ఏకంగా నాని సినిమాకు సంబంధించిన ఫోటోలు కాకుండా విజయ్ దేవరకొండ రష్మిక మందన కు సంబంధించిన ఫోటోలు ప్రదర్శించడం తో అందరూ షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి.
ఇదే విషయం గురించి ప్రమోషన్స్ లో పాల్గొన్న న్యాచురల్ స్టార్ నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పెద్ద సినిమాలు కూడా కొన్నేళ్ల తర్వాత ప్రేక్షకులు మర్చిపోతారు. మనం చేసే సినిమాలు గురించి కొన్నాళ్ల తర్వాత కూడా మాట్లాడుకోవాలని నేను కోరుకుంటా అంటూ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో ఫ్రీ రిలీజ్ వేడుకలో విజయ్, రష్మిక ఫోటోలను డిస్ ప్లే చేయడం గురించి మాట్లాడుతూ.. పొరపాటున అలా చేసి ఉంటారు. కావాలని చేసింది కాదు. ఆ ఫోటోలు వస్తాయని మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ నాచురల్ స్టార్ నాని చెప్పుకొచ్చాడు.