'హాయ్ నాన్న' గురించి ఆ విషయం చెప్పి.. అంచనాలు పెంచిన డైరెక్టర్?
ఇక ట్రైలర్ కు అటు ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అని చెప్పాలి. అయితే ఇక ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీన రిలీజ్ కు సిద్ధమవుతూ ఉండగా.. ప్రస్తుతం మూవీ ప్రమోషన్స్ లో బిజీబిజీగా ఉన్నారు. కాగా ఈ మూవీలో నాని సరసన మృనాల్ ఠాగూర్ హీరోయిన్గా నటిస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ప్రమోషన్స్ లో భాగంగా హీరో నాని ఈ మూవీకి సంబంధించి చేస్తున్న కామెంట్స్ అన్ని కూడా ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు పెంచేసాయ్. . ఇకపోతే హాయ్ నాన్న సినిమా గురించి డైరెక్టర్ శౌర్యువ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
హాయ్ నాన్న సినిమాకు తండ్రీ కూతురు మధ్య అనుబంధమే ప్రధాన బలం అంటూ డైరెక్టర్ చెప్పుకొచ్చాడు. అయితే ప్రేక్షకులకు గుర్తుంటుందని ప్రేమ కథను తీశాను అంటూ తెలిపాడు. ఇక ట్రైలర్ ద్వారానే సినిమా కథను చెప్పే ప్రయత్నం చేశాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ సినిమాలో ఎన్నో సర్ప్రైజ్ పాత్రలు ఉంటాయి అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా 97 రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తి చేసాము అంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్ శౌర్యువ్. అయితే సర్ప్రైజ్ పాత్రలు ఉంటాయనే విషయం చెప్పి ఈ మూవీపై అంచనాలను పెంచేసాడు డైరెక్టర్. ఇక ఈ మూవీపై భారీ రేంజ్ లో అంచనాలు ఉండగా.. ఇక నాని ఈ సినిమాతో ఎలాంటి హిట్టు కొడతాడో చూడాలి మరి.