టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్గా నటించి భారీ విజయాన్ని అందుకుంది శాలిని పాండే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగులో నే కాకుండా కబీర్ సింగ్ పేరుతో హిందీలో కూడా విడుదలై అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ శాలిని కెమిస్ట్రీ ఎంత అత్యద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇటీవల శాలిని ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక ఆ ఇంటర్వ్యూలో భాగంగా తనకి సంబంధించిన వాళ్ళు రకాల విషయాలను
అభిమానులతో పంచుకుంది. అలాగే బాలీవుడ్లో వచ్చిన కబీర్ సింగ్ సినిమాలో కూడా మీరే హీరోయిన్గా నటించి ఉంటే బాగుండేది కదా అని అడిగిన ప్రశ్నకి గాను షాకింగ్ సమాధానాన్ని ఇచ్చింది. అసలు నాకు ఆలోచన రాలేదు నేను దానిని ఒక రీమిక్స్ సినిమా లాగా చూడలేదు. ఇద్దరు కొత్త హీరోయిన్ లతో వచ్చిన సినిమా కాబట్టి చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని చూశాను. షాహిద్ కపూర్ కియారా అద్వానీ కెమిస్ట్రీ సినిమాలో చాలా అద్భుతంగా చూపించారు. ప్రీతి పాత్రలో ఇద్దరం విభిన్నమైన భావోద్వేగాలను కనబరిచాము అంటూ ఈ సందర్భంగా వెల్లడించింది.
తెలుగు హిందీ తమిళ భాషల్లో నటించను ఓకే భాషలో నటించాలన్న పట్టింపులు నాకు లేవు. తెలుగు సినిమాలో తిరిగి చేయాలి అని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా వెల్లడించింది శాలిని. ఎందుకంటే తెలుగు సినిమాతోనే నేను ఈ రంగంలో అడుగుపెట్టా. తెలుగమ్మాయిని కాకపోయినా.. నా తొలి సినిమాకు ప్రేక్షకులు అందించిన ప్రేమ ఎంతో ప్రత్యేకం అంటూ వ్యాఖ్యల్ని జోడించింది. ప్రస్తుతం ఆమె ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు రెండు ప్రాజెక్టులతో సిద్ధంగా ఉంది. దాంతోపాటు బాలీవుడ్లో మహారాజా అనే సినిమాలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ త్వరలోనే ఆ సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది..!!