నిత్యా మీనన్ ఇండస్ట్రీలోకి రాకపోతే ఆ పని చేసేదట..!!
ఎన్నో అబినవ పాత్రలలో నటించిన నిత్యా మీనన్ కొన్ని సినిమాలలో బోల్డ్ రోల్స్ లో కూడా నటించి మెప్పించడం జరిగింది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వచ్చిన అవకాశాలను కూడా సద్వినియోగం చేసుకుంటూ తన కెరియర్ని ముందుకు తీసుకుపోయేలా చేస్తోంది ఈ అమ్మడు. ప్రతి పాత్రను కూడా ఎంజాయ్ చేస్తూ నటిస్తూ ఉంటుంది నిత్యా మీనన్. ఒకవేళ సినిమా కథ నచ్చకపోతే ఆ సినిమాకి దూరంగా ఉంటానని తెలియజేయడం జరిగింది. అలా దాదాపుగా రెండేళ్లపాటు సినిమా షూటింగ్లకు దూరంగా ఉండేదాన్ని అని కూడా తెలియజేయడం జరిగింది.
సినిమా ఒప్పుకోవడం చాలా సులువు అని తన పాత్రకు తాను న్యాయం చేయగలనని.. ఎలాంటి ఫలితాన్ని అయినా సరే పట్టించుకోనని తెలియజేసింది ఈ అమ్మడు వాస్తవానికి తన కెరియర్లో హీరోయిన్ గా ఛాన్స్ లేదని జర్నలిస్టుగా కావడమే తన ఆశయమని తెలియజేసింది. అయితే సినిమాలో అనుకోకుండా ఎంట్రీ ఇవ్వడం వల్ల మంచి పాపులారిటీ రావడంతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగిందని తెలియజేసింది. కొన్నిసార్లు మనకు ఏ మాత్రం తెలియకుండానే మన ఇష్ట అభిరుచులు సైతం మారుతూ వస్తూ ఉంటాయని తెలియజేయడం జరిగింది నిత్యామీనన్. తాజాగా ఇమే చేసిన కామెంట్లు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇటీవల ఈమె నటించిన చిత్రాలు వెబ్ సిరీస్ లన్నీ కూడా బాగానే సక్సెస్ అవుతున్నాయి.