సూపర్ స్టార్ రజనీ కాంత్ ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే రజినీ కాంత్ నటించిన అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో శివాజీ మూవీ ఒకటి. ఈ సినిమాకు ఇండియా లోనే అత్యంత క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటి శ్రేయ ... రజనీ కి జోడిగా నటించింది.
ఈ మూవీ లో సుమన్ ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ 2007 వ సంవత్సరం విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల అయ్యి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది. ఇలా ఆ సమయంలో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు.
ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల అయింది. ఈ మూవీ రీ రిలీజ్ తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన రీ రిలీజ్ ట్రైలర్ ను ఈ రోజు విడుదల చేయబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల అయ్యింది. ఈ మూవీ యొక్క రీ రిలీజ్ ట్రైలర్ ను ఈ రోజు ఎస్ ఎస్ తమన్ చేతుల మీదగా ఈ మూవీ బృందం విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేస్తూ ఈ మూవీ బృందం ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.