గేమ్ ఛేంజర్ 90 శాతం పూర్తయింది : దిల్ రాజు..!!

Anilkumar
తెలుగు రాష్ట్రాల్లో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన 'యానిమల్'  మూవీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించింది. ఇదే విషయాన్ని నిర్మాత దిల్ రాజు మీడియా వేదికగా తెలియజేశారు. 'యానిమల్' మూవీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవడంతో మొదటి రోజు రికార్డు కలెక్షన్స్ సాధించిందని అన్నారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఈ సినిమాకి రూ.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని, ఈ వారాంతంలోనే రూ.35 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు గ్రాస్ అందుకుంటుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 


ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.." సినిమా గ్లోబల్ అయిందని చెప్పడానికి ఈ సినిమా విజయం ఓ ఉదాహరణ. మన హీరోలు ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు అక్కడి హీరోల సినిమాల్ని కూడా మన ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందరికీ కనెక్ట్ అయ్యేలా చిత్రాలు తీస్తే వాటిని అందరూ ఆదరిస్తారు అనడానికి ఇదొక ఉదాహరణ. యానిమల్ తరహా చిత్రాన్ని మా సంస్థలో కూడా నిర్మిస్తాం" అని అన్నారు. అనంతరం తమ బ్యానర్లో రూపొందుతున్న కొత్త సినిమాల గురించి కూడా స్పందించారు. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నాలుగు సినిమాలు, 


దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో మూడు సినిమాలు చేస్తున్నట్లు చెప్పిన ఆయన.. శంకర్ - రామ్ చరణ్ కలయికలో నిర్మిస్తున్న 'గేమ్ చేంజర్' సినిమా ఇప్పటికే 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు స్పష్టత ఇచ్చారు. అంతేకాకుండా సంక్రాంతి బరిలో పోటీపడుతున్న మహేష్ బాబు 'గుంటూరు కారం'వెంకటేష్ 'సైంధవ్'చిత్రాన్ని నైజంలో తానే పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే సంక్రాంతికి రావలసిన విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' సినిమాని మార్చ్ లో విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. 
ఇక యానిమల్ సినిమా విషయానికొస్తే.. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ మూవీ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు రూ.116 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ నాన్ హాలిడే ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: