నేను "దూత" వెబ్ సిరీస్ అందుకే చేశాను... నాగచైతన్య..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో నాగ చైతన్య ఒకరు. ఈయన తాజాగా దూత అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ కు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించాడు. ఇకపోతే నాగ చైతన్య కెరియర్ లో ఇదే మొట్ట మొదటి వెబ్ సిరీస్ కావడం విశేషం. అలాగే దర్శకుడు విక్రమ్ కే కుమార్ కి కూడా ఇదే మొట్ట మొదటి వెబ్ సిరీస్. ఇలా వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన సిరీస్ కావడం ... అలాగే వీరిద్దరికి కూడా ఇదే మొట్ట మొదటి వెబ్ సిరీస్ కావడంతో దీనిపై ప్రేక్షకులు మొదటి నుండి మంచి అంచనాలు పెట్టుకున్నారు.


అలా మంచి అంచనాల నడుమ ఈ సీరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి కొన్ని రోజుల క్రితం నుండి అందుబాటులోకి వచ్చింది. ఈ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే తాజాగా నాగ చైతన్య ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా చైతన్య ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా నాగ చైతన్య మాట్లాడుతూ ... నేను వెబ్ సిరీస్ లు కూడా చేయాలని డిసైడ్ అయిన టైంలో ఈ ప్రాజెక్టు వచ్చింది.


విక్రమ్ గారు దూత కథ చెప్పగానే నాకు చాలా బాగా నచ్చేసింది. ఇలాంటి కథలను ఆయన చాలా బాగా డీల్ చేస్తాడనే విషయం నాకు బాగా తెలుసు. అందుకే ఇక నేను రెండో ఆలోచన చేయకుండా ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను అని నాగ చైతన్య తాజా ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఇకపోతే ప్రస్తుతం చైతన్య ... చందు మండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండేల్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: