అప్పుడే మొదలు పెట్టేస్తున్న నాగార్జున..!!

Divya
టాలీవుడ్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలకు ఎంత ఏజ్ వచ్చినా కూడా వారి పక్కన యంగ్ హీరోయిన్స్ మాత్రమే నటించాలని కోరుకుంటూ ఉంటున్నారు. వీటి గురించి చాలామంది ఎన్నో రకాలుగా చెప్పిన అది మాత్రం కుదరడం లేదు.. ఇటీవలే బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్.. చిరంజీవి పక్కన తమన్నా.. బాలయ్య కాజల్ అగర్వాల్ చిరంజీవి శృతిహాసన్ వంటి కాంబినేషన్లో సినిమాలు విడుదల కావడం జరిగింది. అయితే ఇప్పుడు నాగార్జున విషయంలో కూడా ఇదే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. నాగార్జున నటిస్తున్న నా సామి రంగ సినిమాని విజయ్ బిన్నీ దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు.


ఇందులో నాగార్జున సరసన వరలక్ష్మి అనే పాత్రలో ఆశికా రంగనాథ్ నటిస్తున్నట్లు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈ సినిమా కథను డైలాగులను సైతం ప్రసన్నకుమార్ బెజవాడ అందిస్తూ ఉన్నారు. మలయాళం లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఫోరింజు మరియమ్ జోష్  అనే చిత్రాన్ని రీమిక్కుగా తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అచ్చ తెలుగు అమ్మాయిల కనిపిస్తున్న ఆషిక రంగనాథ్ ఆమె రెడీ అయిన విధానం కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది.


ముఖ్యంగా ఈమె రెడీ అవుతూ ఉండగా పక్కనే ఉన్న గోడలో నుంచి నాగార్జున ఆమెను చూస్తూ ఉండడం ఇక్కడ మనం గమనించవచ్చు. వీరిద్దరి జోడి కాస్త ఎబ్బేట్టుగానే కనిపిస్తోంది అంటూ పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. నాగార్జున సరసన ఆశిక చాలా చిన్న పిల్లల కనిపిస్తోందంటూ నాగార్జునకు తగ్గ జోడి పెడితే బాగుండేదేమో అన్నట్లుగా పలువురు అభిమానులు సైతం తెలుపుతున్నారు. అయితే కథను బట్టి పాత్రను బట్టి ఈమెను తీసుకుని ఉండవచ్చు అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు.. వచ్చే ఏడాది ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది .ఎలాగైనా నాగార్జున కూడా ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా చిత్ర బృందం ఈ రోజు నుంచే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: