అది సినిమాలో ఒకభాగం అంటున్న మెగాస్టార్....!!
అదేమిటంటే ఈ రోజు చిరంజీవిని ఒక హీరోయిన్ చెంప దెబ్బ కొట్టడంతో ఆ విషయాన్ని మెగా అభిమానులు సీరియస్ గా తీసుకొని ఆమె పై మండిపడ్డారట. ఇంతకీ ఆ సినిమా ఏది ఆ హీరోయిన్ ఎవరు అన్న వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి నటించిన స్నేహం కోసం సినిమాలో చిరంజీవి సరసన మీనా హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఒక సన్నివేశంలో భాగంగా మీనా హీరో చిరంజీవిని చంప దెబ్బ కొట్టింది. ఆమెకు ఎంత ధైర్యం చిరంజీవిని కొట్టింది అంటూ ఆమెపై తీవ్రస్థాయిలో మండి పడ్డారట.
ఇదే విషయం గురించి హీరో చిరంజీవి ఈవెంట్ లో స్పందిస్తూ ఆమె నన్ను నిజంగానే కొట్టలేదు. అది కేవలం సినిమా. అయినా సినిమాలో ఆ సన్నివేశంలో హీరోయిన్ నన్ను కొట్టకపోతే ఆ సన్నివేశానికి అర్థం ఉండదు. కాబట్టి సినిమాలను ప్రేక్షకులు సీరియస్గా తీసుకోవడం మానేయండి అది కేవలం సినిమా మాత్రమే అని నచ్చ చెప్పారట. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.