ఓటీటిలోకి వచ్చేస్తున్న జపాన్ మూవీ..!!

Divya
కోలీవుడ్లో హీరో కార్తీ కి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నది.ఇప్పటివరకు అతడు నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకున్నాయి. ఇటీవల జపాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కార్తీ కెరియర్ లోనే 25వ సినిమాగా రిలీజ్ చేయడం జరిగింది.. ఈ సినిమాని డైరెక్టర్ రాజు మురుగన్ దర్శకత్వం వహించారు. ఇందులో హీరోయిన్గా అను ఇమ్మాన్యూయేల్ నటించింది. సరికొత్త పాత్రలో ఇందులో కార్తీక్ కనిపించారు. ట్రైలర్ విడుదలతో ఈ సినిమాకి మంచి హైప్ ఏర్పడేలా చేశారు.

డిఫరెంట్ గెటప్పులలో బాడీ లాంగ్వాజ్ తో కడుపుబ్బ నవ్వించారు కార్తీక్ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఓటీటి లోకి విడుదల కాబోతోంది. జపాన్ డిజిటల్ స్ట్రిమింగ్ డేట్ ల పైన పలు రకాల రూమర్స్ వినిపిస్తూ ఉన్నాయి. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పైన అఫీషియల్ క్లారిటీ రావడం జరిగింది. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయినా నెట్ ఫ్లిక్స్ లో డిసెంబర్ 11 నుంచి అన్ని భాషలలో అందుబాటులోకి రాబోతున్నట్లు నెట్ ఫిక్స్ అధికారికంగా ప్రకటించడం జరిగింది.

ఈ సినిమా నిజ జీవితంలో జరిగిన ఒక దొంగ పదాంశంతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఆవారా, ఊపిరి, ఖైదీ, సర్దార్  సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న కార్తి ఆ తర్వాత తమిళంలో తన సినిమాలను తెలుగులో డబ్ చేస్తూ విడుదల చేసి మంచి విజయాలను అందుకున్నారు.. ప్రస్తుతం డైరెక్టర్ నలన్ కుమార్ స్వామి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది ఇందులో హీరోయిన్గా కృతి శెట్టి అన్నట్టుగా సమాచారం వచ్చే యేడాది వేసవిలో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే త్వరలోనే ఖైదీ -2 కూడా మొదలు పెట్టబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: