సలార్ సినిమా రూమర్స్ పై దిమ్మతిరిగే సమాధానం చెప్పిన డైరెక్టర్..!!
కే జి ఎఫ్ ,సలార్ సినిమాలు రెండు విభిన్నమైన ప్రపంచాలంటూ తెలియజేశారు. ఈ రెండు ప్రపంచాలను కలపాలని నేను కోరుకోనని తెలియజేయడం జరిగింది ప్రశాంత్ నీల్.. ప్రభాస్ సినిమా కథను సులువుగా ఒప్పుకోరని తన అభిప్రాయంగా తెలియజేశారు. ఒక బ్లాక్ బస్టర్ మూవీని కాపీ చేయవలసిన అవసరం కూడా ప్రభాస్కు లేదని కూడా తెలియజేయడం జరిగింది. ప్రభాస్ స్థాయి కూడా అది కాదని కూడా డైరెక్టర్ క్లారిటీ ఇవ్వడం జరిగింది.
ప్రశాంత్ నీల్ తెలియజేసిన ఈ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.. మొత్తానికి సలార్ సినిమా పైన వస్తున్న రూమర్లకు సైతం ప్రశాంత్ నీల్ ఇలా చెక్ పెట్టారని చెప్పవచ్చు. సలార్ సినిమాకి ఇటు ప్రశాంత్ నీల్ రెమ్యూనరేషన్ ప్రభాస్ రెమ్యూనరేషన్ భారీ స్థాయిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా రెండో భాగం పైన కూడా భారీగా అంచనాలు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఈ ఏడాది అత్యధిక కలెక్షన్స్ తో ఈ సినిమా భారీ స్థాయిలో రాబడుతుందేమో చూడాలి మరి. ఏది ఏమైనా ప్రభాస్ తన స్టామినా చూపిస్తారేమో తెలియాలి అంటే మరొక కొద్ది రోజులు ఆగాల్సిందే.