ఎన్టీఆర్ తో చేసే మూవీ డిఫరెంట్ గా ఉంటుందంటున్న స్టార్ డైరెక్టర్....!!

murali krishna
కేజీఎఫ్ సిరీస్ తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ తాజాగా ప్రభాస్ తో సలార్ మూవీని తెరకెక్కిస్తున్నారు.తాజాగా రిలీజ్ అయిన సలార్ సీజ్ ఫైర్ 1 ట్రైలర్ సినిమా పై వున్న హైప్ ను మరింతగా పెంచేసింది.ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఇదిలా ఉంటే కేజిఎఫ్ ఫ్రాంఛైజీలో కేజీఎఫ్ 3 కూడా రాబోతోందని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కన్ఫమ్ చేశారు.తాజాగా పింక్‌విల్లాతో మాట్లాడిన ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 3 కచ్చితంగా వస్తుందని, అయితే తాను డైరెక్టర్ గా ఉంటానా లేదా అన్నది మాత్రం చెప్పలేనని తెలిపారు.

ప్రస్తుతం సలార్ రిలీజ్ కోసం వేచి చూస్తున్న ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ 3 పై చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.కేజీఎఫ్ 3 కచ్చితంగా వస్తుంది. నేను డైరెక్టర్ నా కాదా అన్నది నాకు తెలియదు. కానీ యశ్ మాత్రం కచ్చితంగా అందులో నటిస్తారని తెలిపారు.అంతేకాదు మా దగ్గర స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉంది. అనౌన్స్ చేసే ముందు స్క్రిప్ట్ పై ఓ నిర్ణయానికి వచ్చాం. యశ్ చాలా బాధ్యతాయుతమైన వ్యక్తి. కేవలం కమర్షియల్ కారణాలతోనే పని చేయడు. అంతా సిద్ధంగా ఉన్నదని ధృవీకరించుకున్న తర్వాతే కేజీఎఫ్ 2 చివర్లో మరో పార్ట్ అనౌన్స్ చేశాం.. అని ప్రశాంత్ నీల్ చెప్పారు.


ఇదిలా ఉంటే సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్31 గా పిలువబడుతున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ పెట్టలేదు. అయితే ఈ సినిమా స్టోరీ గురించి ప్రశాంత్ స్పందించాడు. ఇది చాలా కొత్త స్టోరీ అని ఆయన అన్నారు.భిన్నమైన ఎమోషన్లతో సాగే ఓ భిన్నమైన సినిమా ఇది. జానర్ గురించి ఇప్పుడు నేనేమీ చెప్పను. కానీ ఇదొక యాక్షన్ సినిమా అని అభిమానులు అనుకుంటారు. నాకు మాత్రం నేను ప్రేక్షకులకు చెప్పాలనుకున్న కొత్త స్టోరీ ఇది. దానికి తగిన ఎమోషన్ కూడా ఇందులో ఉంది అని ప్రశాంత్ నీల్ చెప్పారు.2024లో జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. 2025లో సినిమా రిలీజ్ అవుతుంది. ఆ తర్వాతే అతడు యశ్ తో కేజీఎఫ్ 3 తీసే అవకాశం ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర మూవీతో బిజీగా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: