టాలీవుడ్
కింగ్ అక్కినేని
నాగార్జున ప్రస్తుతం నా సామి రంగ అనే విలేజ్ బ్యాక్ డ్రాప్
మూవీ లో
హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ కి ప్రముఖ డ్యాన్స్ కొరియో గ్రాఫర్
విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తూ ఉండగా ...
అల్లరి నరేష్ ,
రాజ్ తరుణ్ ఈ
మూవీ లో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. అమిగొస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన అశిక
రంగనాథ్ ఈ
మూవీ లో
నాగార్జున కి జోడిగా కనిపించబోతుంది.
ఇకపోతే ఈ
మూవీ ని వచ్చే సంవత్సరం
జనవరి నెలలో విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. అందుకు అనుగుణం గానే ఈ
మూవీ బృందం ఈ
సినిమా షూటింగ్ ను పూర్తి చేస్తూ వస్తుంది. ఇక ఈ
మూవీ విడుదల సమయం కూడా దగ్గర పడడంతో ఈ
మూవీ లోని మొదటి పాట విడుదలకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ఈ
మూవీ బృందం తాజాగా విడుదల చేసింది.
ఈ
మూవీ లోని మొదటి సాంగ్ అయినటువంటి "ఎత్తుకెళ్లి పోవాలనిపిస్తుందే" అంటూ సాగబోయే సాంగ్ యొక్క ప్రోమో ని మరికొన్ని రోజుల్లో విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ
పోస్టర్ ను విడుదల చేసింది. ఈ చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన ఈ
పోస్టర్ లో
నాగార్జున తెల్ల కలర్ లో ఉన్న పంచను కట్టుకొని ... బ్లూ కలర్ లో ఉన్న హాఫ్ హ్యాండ్ షర్ట్ ను వేసుకొని టాక్టర్ పై కాలును వేసి అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ
పోస్టర్ అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ
మూవీ పై
నాగార్జున అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.