'యానిమల్'
మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రణ్ బీర్ కపూర్,
రష్మిక మందన జంటగా నటించిన ఈ
మూవీ పాన్
ఇండియా లెవెల్ లో విడుదలై అన్ని చోట్ల హిట్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా నార్త్
ఆడియన్స్ ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఎప్పటిలాగే
సందీప్ వంగ తన మేకింగ్ లో కల్ట్ వెర్షన్ ని చూపించడంతోపాటు ఈసారి వైలెన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. 'A' సర్టిఫికెట్ ఇచ్చిన సినిమాకి ప్రేక్షకుల నుంచి ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం బహుశా ఇదే మొదటిసారి ఏమో. అందుకే సౌత్ తో పాటు నార్త్ లోనూ
డైరెక్టర్
సందీప్ రెడ్డి వంగ పేరు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. సినిమాలో రణబీర్ తన నట విశ్వరూపం చూపించారు. దీంతో రణ్ బీర్ యాక్టింగ్ పై ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమాతో హీరోగా రణ్ బీర్ కి ఎంత పేరొచ్చిందో,
డైరెక్టర్ గా
సందీప్ రెడ్డి వంగా కి అంతకంటే ఎక్కువ పేరు వచ్చిందని చెప్పొచ్చు. కేవలం మూడో సినిమాకే అటు ఇండస్ట్రీలోనూ ఇటు
ఆడియన్స్ లోను ఈ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు.
రాజమౌళి లాంటి
డైరెక్టర్ కే ఇది సాధ్యం కాలేదు. ఎలాంటి సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోకుండా
సందీప్ వంగా ఈ సినిమాని తెరకెక్కించడం విశేషం.