ఏంటి.. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ రెమ్యూనరేషన్ అన్ని కోట్లా..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు రాజమౌళి. ప్రస్తుతం ఆయన వంద కోట్లు వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అర్ అర్ అర్ సినిమాతో ఆయన రేంజ్ ఈ స్థాయికి చేరింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు సినిమాతో విజయాన్ని అందుకుంటే మాత్రం ఆయన రెమ్యూనరేషన్ మరింత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే రాజమౌళి సినిమాల సక్సెస్ వెనక ఆయన తండ్రి విజయేంద్రప్రసాద్ ఉన్నారు అన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆయన అందించిన కథలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి.

ప్రస్తుతం రాజమౌళి ఆయన చేస్తున్న ఒక సినిమాకి స్క్రిప్ట్ అందించడానికి ఐదు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అన్న వార్తలు వినబడుతున్నాయి. అయితే ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్న మరో రైటర్ భారతీయ సినీ ఇండస్ట్రీలోని ఇప్పటివరకు లేరు. భవిష్యత్తు ప్రాజెక్టులు సక్సెస్ సాధిస్తే ఆయన రెమ్యునరేషన్ మరింత పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఆయన వయస్సు ప్రస్తుతం 81 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఆయన ఇంత ఎనర్జిటిక్ గా కొత్త కొత్త కథలను ఆలోచిస్తున్నారు అంటే గర్వించదగ్గ విషయం. ఇక ఆయన రాసే కథలల్లో

ఎటువంటి ట్విస్టులు ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఊహించని ట్రస్టులతో ఇప్పటికీ కథలను అందిస్తూ ప్రశంసలను అందుకుంటున్నారు విజయేంద్ర ప్రసాద్. విజయేంద్ర ప్రసాద్ రాబోయే రోజుల్లో నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లతో మరింత సత్తా చాటాలని నెటిజన్లు ఫీలవుతుండటం గమనార్హం. ఇతర భాషల ప్రేక్షకులకు సైతం విజయేంద్ర ప్రసాద్ కథలు ఎంతగానో నచ్చుతున్నాయి. కెరీర్ పరంగా విజయేంద్ర ప్రసాద్ మరింత ఎదగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. విజయేంద్ర ప్రసాద్ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. విజయేంద్ర ప్రసాద్ టాలీవుడ్ ఇండస్ట్రీ ఖ్యాతిని ఊహించని స్థాయిలో పెంచుతున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: