టాలీవుడ్
యువ హీరోలలో ఒకరు అయినటువంటి అక్కినేని
నాగ చైతన్య ప్రస్తుతం తండెల్ అనే భారీ బడ్జెట్ పాన్
ఇండియా మూవీ లో
హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ కి
కార్తికేయ 2
మూవీ తో
ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న చందు మండేటి దర్శకత్వం వహిస్తూ ఉండగా ...
గీత ఆర్ట్స్ బ్యానర్ పై
అల్లు అరవింద్ ఈ
మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాలో
సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.
ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ
మూవీ నుండి ఈ చిత్ర బృందం ఈ
సినిమా టైటిల్ మరియు
నాగ చైతన్య కు సంబంధించిన ఫస్ట్ లుక్
పోస్టర్ ను విడుదల చేసింది. వీటికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. మరి ముఖ్యంగా ఈ మూవీన్లో చైతూ లుక్ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఈ
మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ వీడియోను విడుదల చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.
అసలు విషయం లోకి వెళితే ... ఈ
మూవీ బృందం వారు ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ వీడియోను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో కోసం అల్లు స్టూడియోస్ లో ఈ
మూవీ బృందం వారు తాజాగా షూట్ ను కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇక
డిసెంబర్ 20 వ తేదీ లోపు ఈ
మూవీ గ్లిమ్స్ వీడియోను విడుదల చేసే ఆలోచనలో ఈ
మూవీ బృందం ఉన్నట్లు అలాగే ఈ వీడియోను సలార్
మూవీ తో అటాచ్ చేసి ధియేటర్ లలో ప్రదర్శించే ఆలోచనలో ఈ చిత్ర బృందం ఉన్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే తండెల్
మూవీ గ్లిమ్స్ వీడియోలో
నాగచైతన్య మాస్ డైలాగ్స్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.