వివాహం చేసుకున్న రానా సోదరుడు.. వధువు బ్యాక్ గ్రౌండ్ ఇదే..!!

Divya
తెలుగు ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా పేరు పొందిన సురేష్ బాబు అందరికీ సుపరిచితమే.. ఇయన కుమారుడు రానా సోదరుడు అభిరామ్ నిన్నటి రోజున వివాహం బంధంలోకి అడుగుపెట్టారు.. అభిరామ్ ప్రత్యూష అనే అమ్మాయితో వీరి పెళ్లి శ్రీలంకలో చాలా ఘనంగా జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉన్నాయి. ఈ పెళ్లిలో దగ్గుబాటి కుటుంబ సభ్యులు బంధువులు హాజరైనట్లుగా తెలుస్తోంది. అయితే గత కొంతకాలంగా అభిరామ్ పెళ్లి వార్తలు వినిపిస్తున్న ఈ విషయం పైన ఎవరు స్పందించలేదు..



తాజాగా ఎట్టకేలకు అభిరామ్ వివాహ బంధం లోకి అడుగుపెట్టడం జరిగింది. అయితే అభిరామ్ వివాహం చేసుకున్న అమ్మాయి వరుసకు అభిరామ్ కు మరదలు అవుతుందట. ఈమె పేరు ప్రత్యూష వీరి స్వస్థలం కూడా కారంచెడు. అలాగే సురేష్ బాబు ఒకప్పటి స్వగ్రామం కూడా ఇదేనట..అందుచేతనే వీరికి బంధువులు అవ్వడం చేత ఆ అమ్మాయిని అభిరామ్ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా రామానాయుడు తమ్ముడి మనవరాలు అభిరామ్ వివాహం చేసుకున్నట్లుగా సమాచారం. ఇది కుటుంబ సభ్యులు కుదిర్చిన వివాహం అన్నట్లుగా తెలుస్తోంది.


అభిరామ్ తన నటించిన అహింస సినిమా ఘోరమైన డిజాస్టర్ ని మూట కట్టుకొని దీంతో తన తదుపరి సినిమా పైన ఫోకస్ పెట్టలేదన్నట్లుగా తెలుస్తోంది. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పి.. బిజినెస్ వైపుగా అడుగులు వేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ మేరకు బిజినెస్ వైపుగా సక్సెస్ అవుతారో అభిరామ్ చూడాలి.. తాజాగా వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రానా అభిమానులు అభిరామ్ అభిమానులు సైతం సోషల్ మీడియాలో వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందే అభిరామ్ శ్రీరెడ్డి విషయంలో ఎన్నోసార్లు వైరల్ గా మారారు. మరి ఈ పెళ్లిపై శ్రీ రెడ్డి ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: