ఆ పదానికి అర్ధం చెప్పిన బాలీవుడ్ బాద్షా....!!

murali krishna
దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరానీ, స్టార్ హీరో షారుక్‌ ఖాన్‌ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'డంకీ'. ఈ టైటిల్ క్యాచీగా ఉండటంతో పై ఆసక్తి నెలకొంది.ఈ టైటిల్‌కి అర్థం ఏమిటనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అనే దానికి సమాధానం చూస్తేనే దొరుకుతుంది. అయితే అంతకుముందే షారూఖ్ ఖాన్ ' డుంకీ ' అంటే ఏమిటో చెప్పాడు . సోషల్ మీడియాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించిన షారుఖ్ ఖాన్ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.పంజాబ్‌కు చెందిన కొంతమంది యువకులు ఇంగ్లండ్‌కు వెళ్లాలని కలలు కంటూ భారత సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించే కథాంశంతో తెరకెక్కిన చిత్రం 'డంకీ'. ట్రైలర్‌లోనే దానికి సంబంధించిన హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ లో దుమ్ము రేపింది. ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.
డిసెంబర్ 21న 'డంకీ' విడుదల కానుంది. ఈ లో షారుఖ్ ఖాన్ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. అతనికి జోడీగా తాప్సీ పన్ను నటిస్తోంది. విక్కీ కౌశల్ మరో కీలక పాత్రలో నటించాడు. ఇంతమంది ఆర్టిస్టుల వల్ల పై అంచనాలు పెరిగాయి. ట్రైలర్‌ని చూసిన అభిమానులు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఈ చాలా క్లాస్‌గా తీసినట్లు ట్రైలర్‌ చేస్తే అర్ధమవుతుంది. తాజాగా డంకి అంటే అర్ధమేంటో చెప్పాడు షారుక్. అనుమతి లేకుండా దేశ సరిహద్దులు దాటడాన్ని గాడిద జర్నీ అంటారు. పంబాబీ యాసలో దాని డంకీ అంటారు' అని షారుక్ ఖాన్ అన్నారు.
రాజ్‌కుమార్ హిరానీ వర్క్‌పై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే 'పీకే', 'సంజు', '3 ఇడియట్స్', 'మున్నాభాయ్ ఎంబీబీఎస్' ల ద్వారా తన ప్రతిభను నిరూపించుకున్నాడు రాజ్‌కుమార్ హిరానీ. ఇప్పుడు 'డంకీ' ద్వారా ప్రేక్షకులకు కొత్త కథను చూపించేందుకు సిద్ధమయ్యాడు. 'డంకీ' రిలీజ్ అయిన మరుసటి రోజు డిసెంబర్ 22న ప్రభాస్ 'సలార్' విడుదల కానుంది. కాబట్టి బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: