సెకండ్ ట్రైలర్ గూర్చి అప్డేట్ ఇచ్చిన సలార్ టీం....!!

murali krishna
తెలుగు నుంచి మొదటి పాన్ ఇండియా హీరోగా భారీ గుర్తింపును సంపాదించుకున్న హీరో ప్రభాస్…ఈయన చేసిన బాహుబలి సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఒక తెలుగు వాడి సత్తా ఏంటో చూపించి బాలీవుడ్ ఇండస్ట్రీ ని షేక్ చేసింది.అలాగే ఒక తెలుగు హీరో బాలీవుడ్ లో సునామీని సృష్టించి తెలుగు సినిమా రేంజ్ ఏంటో చూపించాడు. ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్టప్ తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇక ఆ తర్వాత వచ్చిన సాహో సినిమా కూడా బాలీవుడ్ లో సక్సెస్ ని అందుకుంది. ఇక ఇప్పుడు సలార్ సినిమాతో మరోసారి జులు విదిల్చిన సింహం లా బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయబోతున్నాడు. ఇక ఈ క్రమంలోనే 22వ తేదీన సలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా ఆ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ ఇప్పటికే రిలీజై మంచి గుర్తింపును సంపాదించుకుంది… ఇక ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
ఎందుకంటే ఒక క్యారెక్టర్ లో దేవా గా మరో క్యారెక్టర్ సలార్ గా చేస్తూ ప్రేక్షకులకు మంచి ఉత్సాహాన్ని కలిగించే విధంగా ఈ క్యారెక్టర్ ని ప్రశాంత్ నీల్ డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన రెండోవ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక మొదటి ట్రైలర్ తో కొంతమంది ఆడియన్స్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి వాళ్ళని కూడా సాటిస్ఫై చేయడానికి సెకండ్ ట్రైలర్ ని రంగంలోకి దింపుతున్నారు. ఇక ఈ ట్రైలర్ డిసెంబర్ 16వ తేదీన అంటే రిలీజ్ కి కరెక్ట్ గా ఐదు రోజుల ముందు ఈ ట్రైలర్ ని రంగం లోకి దింపుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ ట్రైలర్ లో ఎంట్రీ ఒక రేంజ్ లో ఉండబోతుందనే సమాచారం కూడా అందుతుంది…
ఇక ఈ సినిమాతో ప్రభాస్ ఒక భారీ హిట్ అయితే కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాతో సక్సెస్ కొడితే అటు ప్రశాంత్ నీల్, ఇటు ప్రభాస్ ఇద్దరూ కూడా ఇండియాలోనే టాప్ లెవల్ కి వెళ్ళిపోతారు. అనిమల్ సినిమాతో సందీప్ రెడ్డి వంగ తనదైన రీతిలో ఒక అద్భుతమైన హిట్ సినిమాను తీసి తను పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా భారీ రేంజ్ లో భారీ సక్సెస్ సాధించడానికి సిద్ధంగా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: