భీష్మ మూవీ తర్వాత సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నాడు యువ కథానాయకుడు నితిన్. దర్శకుడిగా తొలి సినిమా నా పేరు సూర్యతో ఎదురు దెబ్బ తిన్నాడు వక్కంతం వంశీ. ఇక ఈ ఇద్దరి కలయికలో తెరకెక్కిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది. నేడు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.
ఈ సినిమాలో హీరోను జూనియర్ ఆర్టిస్టుగా చూపించాలనుకోవడం మంచి ఆలోచన. ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాకి ఒక వైవిధ్యం తీసుకొచ్చింది ఈ ఆలోచనే. క్యూరియస్ గా అనిపించే హీరో పాత్రతో ఫస్ట్ హాఫ్ లో వక్కంతం వంశీ బాగానే ఫన్ జనరేట్ చేయగలిగాడు.ముఖ్యంగా సీనియర్ నటుడు రావు రమేష్ తనదైన టైమింగ్ తో కామెడీలో చెలరేగిపోయాడు. తండ్రి కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు బాగా హిలేరియస్ గా సాగి ప్రేక్షకులను నవ్విస్తాయి. ఓవర్ ద టాప్ స్టైల్లో సాగే కొన్ని సీన్లు కొంచెం అతిగా అనిపించినా టైంపాస్ చేయిస్తాయి. కానీ రాను రాను కొన్ని సీన్లు అయితే శృతిమించిపోతాయి. హీరోయిన్ హీరోకు ఇలా పరిచయం కావడం.. అలా ఆమె ఇంప్రెస్ అయిపోవడం.. 400 కోట్ల కంపెనీకి సీఈఓ, కథానాయకతో పెళ్లి లాంటి భారీ ఆఫర్లు తన్నుకుంటూ చేయడం అయితే సిల్లీగా అనిపిస్తాయి.
సెకండ్ హాఫ్ తేలిపోయింది. అసలు ఇటు డ్రామా పండక.. అటు కామెడీ కూడా వర్కౌట్ కాక.. మరోవైపు హీరో ఎలివేషన్లు కూడా తేలిపోయి.. ఫైనల్ గా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ నిరాశజనకంగా ముగుస్తుంది. రాజశేఖర్ క్యామియో కూడా సినిమాను కాపాడలేకపోయింది.హీరో నితిన్ పెద్దగా హడావిడి చెయ్యకుండా కామెడీ పండించాడు. మంచి ఈజ్ కనిపించింది. లుక్స్ కూడా బావున్నాయి. శ్రీలీల క్యారెక్టర్లు, నటన రొటీన్ అయిపోతున్నాయి. స్కంద, ఆదికేశవ సినిమాల తర్వాత మరో నామమాత్రమైన పాత్రలో ఆమె నిరాశపరిచింది. విలన్ సువేద్ నాయర్ నటనలో ఏ విశేషం లేదు. రావు రమేష్ తెర మీద కనిపించిన ప్రతిసారీ బాగానే ఎంటర్టైన్ చేశాడు. ఆయన కామెడీ ఈ సినిమాకి పెద్ద రిలీఫ్. సో ఓవరాల్ గా ఇదొక యావరేజ్ సినిమా.