హాయ్ నాన్న పక్కా హిట్.. నాని, మృనాల్ ఆసం?

Purushottham Vinay
న్యాచురల్  స్టార్ నాని ప్రస్తుతం స్టార్ హీరోగా దూసుకుపోతూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నాని జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇక దసరా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాని తాజాగా హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.మంచి ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా హిట్ టాక్ సంపాదించుకుంది.కేవలం నాని నటన మాత్రమే కాకుండా హీరోయిన్ మృనాల్ అందం నటన కూడా ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ అయ్యాయి. ఈ సినిమా తమిళ నాడులో కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాతో మృనాల్ ఖచ్చితంగా తెలుగులో పెద్ద స్టార్ హీరోయిన్ గా బిజీ అవ్వడం ఖాయం అనిపిస్తుంది.ఇక ఈ సినిమాకు విడుదల ముందే మరో మూవీ షూటింగ్ స్టార్ చేశారు నాని. దర్శకుడు వివేక్ ఆత్రేయతో సరిపోలేదా శనివారం సినిమాని చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన తరువాత తమిళ దర్శకుడు సిబి చక్రవర్తితో కూడా సినిమా చేయనున్నారు. 



ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయట.ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు 2024 ఫిబ్రవరిలో అధికారికంగా మేకర్స్ ప్రకటించనున్నారు. ఏప్రిల్ లేదా మే నెల నుండి రెగ్యులర్ షూట్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ గట్టిగా జరుగుతోందట. ఈ సినిమాలో హీరోయిన్ గా పొడుగు కాళ్ల సుందరి ప్లాప్ హీరోయిన్ పూజా హెగ్డే కనిపించనుందట. ఈ సినిమాను కూడా నాని వేగంగా పూర్తి చేయలానుకుంటున్నారట. ఎందుకంటే దర్శకుడు శైలేష్ కొలను తో హిట్ 3 ది థర్డ్ కేస్ సినిమా చేయాలని నాని భావిస్తున్నారట.ఇప్పటికే ఈ సీక్వెల్ కు సంబంధించిన హింట్ ను హీరో అడవి శేష్ హిట్ 2 సినిమా క్లైమాక్స్ లో ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. తన లైనప్ లో వరుసగా ఇన్ని సినిమాలు పెట్టుకున్న నాని ఇప్పుడు మరో సినిమాకు కూడా సిద్ధమవుతున్నారట. తనకు దసరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఈ లైనప్ చూస్తుంటే.. నాని వచ్చే ఏడాదంతా కూడా బిజీబజీగా గడపనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: