శివాజీ ఆ సినిమా చేసుంటేనా.. ఇప్పటికీ మరో రేంజ్ లో ఉండేవాడు?

praveen
నటుడు శివాజీ నిన్నటి తరం ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు. ఎన్నో ఫామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అయితే ఇటీవల కాలంలో మాత్రం సినిమాలకు పూర్తిగా దూరమైపోయాడు అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక నేటితరం ప్రేక్షకులు దాదాపుగా శివాజీ అనే వ్యక్తిని మరిచిపోయారు. కానీ ఇప్పుడు బిగ్బాస్ అనే కార్యక్రమం ద్వారా మళ్ళీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా దగ్గరవుతున్నాడు శివాజీ. ఇక ఈ షోలో కి ఎంట్రీ ఇచ్చి మళ్లీ గుర్తింపును సంపాదించుకొని సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని శివాజీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి.


 శివాజీ మొత్తంగా తన కెరియర్ లో హీరోగా 96 సినిమాలు చేశాడు. ఇంకొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేశాడు. మరీ ముఖ్యంగా మిస్సమ్మ సినిమాతో అయితే తెలుగు ప్రేక్షకుల చూపును తన వైపుకు తిప్పుకున్నాడు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక ఆ తర్వాత ఒట్టేసి చెబుతున్న, ఖుషి, ఇంద్ర, సందడే సందడి, ప్రియమైన నీకు ఇలా చాలా సినిమాల్లోనే నటించి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక కొన్నాళ్లుగా సినిమాలకు దూరమై రాజకీయాలపై దృష్టి సారించాడు శివాజీ. ఎవరు ఊహించని రీతిలో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి అద్భుతంగా గేమ్ ఆడుతూ ఇక మన్ననలు పొందుతున్నాడు అని చెప్పాలి.



 ఒకవైపు తన ఆట తాను ఆడుతూనే మరోవైపు రైతుబిడ్డగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ కి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. శివాజీ కీ సంబంధించి ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అతని కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే ఒక క్రేజీ ఆఫర్ దక్కిందట. అదేంటో కాదు పవన్ కళ్యాణ్ కెరియర్ను నిలబెట్టిన తొలి ప్రేమ మూవీ. డైరెక్టర్ కరుణాకరన్ ఆడిషన్స్ చేస్తున్న సమయంలో మాస్టారు చిత్రంలో నటించిన శివాజీని చూసి ఇక ఆయనను తీసుకోవాలని అనుకున్నారట. కానీ అదే సమయంలో పవన్ కళ్యాణ్ సినిమా పోస్టర్ చూసి తన సినిమాకు ఇతనే బాగా సరిపోతాడని భావించి.. చివరికి పవన్ కు కథ చెప్పి ఒప్పించి సినిమా చేశాడట. ఒకవేళ ఆ సినిమా శివాజీ చేసి ఉంటే మాత్రం ఆయన కెరియర్ ఒక రేంజ్ లో ఉండేది అంటూ అభిమానులు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: