హీరో హీరోయిన్లు లేకపోయినా సినిమా చూడగలిగే వాళ్లేమో కానీ.. ఒకానొక టైంలో ఒక నటుడు లేకపోతే మాత్రం ఆ చిత్రం లో తెలుగు ప్రేక్షకులకు ఏదో లోపం కనిపించేది.ఆ నటుడు మరెవరో కాదు మన బ్రహ్మానందం. మనం ఎంతో ముద్దుగా పిలుచుకునే మన బ్రహ్మి. నాగార్జున లాంటి స్టార్ హీరో చెప్పాడు.. తను బాధలో ఉంటే వెంటనే తన పరిస్థితి తీసుకొని అందులో బ్రహ్మానందం ఫోటో చూసుకుంటానని. అది నిజమే మనలో ఎంతోమంది కూడా మనసారా నవ్వాలి అనుకుంటే ఒక్కసారి బ్రహ్మానందం నటించిన ఏదైనా ఒక సీన్ చూస్తే చాలు.. బాధలన్నీ మర్చిపోగలుగుతాం. అంతటి మెజీషియన్ ఆయన. అంతెందుకు ఫేస్బుక్ ..ఇన్స్టాగ్రామ్.. ఇలా ఏది ఓపెన్ చేసినా తప్పకుండా ఎక్కడో ఒక పోస్ట్ లో బ్రహ్మానందం మనకు కనిపించక మానరు. ఆయన్ని ఇష్టపరిని వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు ఉండరు.35ఏళ్ల కెరీర్ లో సుమారు 1000 సినిమాల్లో నటించి నేటికీ రారాజుగా కొనసాగుతున్నాడు.
ప్రస్తుతం చాలా తక్కువ సినిమాలు చేస్తూ ఉన్నా.. ఆయన మళ్లీ ముందులాగా ఎప్పుడు వరుస పెట్టి సినిమాలు చేస్తారు అని ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. చిరంజీవి.. బాలకృష్ణ.. మహేష్ బాబు.. పవన్ కళ్యాణ్ లాంటి వారికి మన తెలుగులో ఎంతమంది అభిమానులు ఉన్నారో అంతకన్నా ఎక్కువ బ్రహ్మానందం కి ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ప్రతి హీరో అభిమాని మన బ్రహ్మానందం ఫ్యానే. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎంత రాసిన ఇంకా ఏదో ఒక మాట మిగిలిపోతుంది. ఒక్కో హీరోకి ఒక్కో ట్యాగ్ ఉంటే ఆ ట్యాగ్స్ అన్నీ కలిపి మన బ్రహ్మీకి ఇవ్వచ్చు.ఒక్క మాటలో చెప్పాలి అంటే మన తెలుగు సినిమాలకు ఆయనే సూపర్ స్టార్ ..మెగాస్టార్.. పవర్ స్టార్.
మరి అలాంటి మన బ్రహ్మీ ఆస్తుల విలువ నీకు తెలుసా.. రూ. 490 కోట్ల నికర విలువతో అత్యంత ధనిక హాస్యనటుడుగా బ్రహ్మానందం నిలబడ్డాడు. జనాదరణతో పాటు, బ్రహ్మానందం టీవీ షోలు, సినిమాలు, లైవ్ ఈవెంట్‌లు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లలో పని చేయడం ద్వారా ఎంతో సంపాదన సంపాదించాడు.. ఇంకా సంపాదిస్తున్నారు కూడా. అందుకే భారతదేశంలోనే అత్యంత సంపన్న హాస్యనటుడి విషయానికొస్తే.. అందులో కపిల్ శర్మ.. జానీ లివర్.. భారతీ సింగ్ లాంటి వారు లేరు.. మన బ్రహ్మానందమే మొదటి శాతం సంపాదించుకున్నారు. రూ. 490 కోట్ల నికర విలువ కలిగిన అత్యంత ధనిక హాస్యనటుడిగా నిలిచారు.అంతే కాదు మన బ్రహ్మానందం నెల జీతం ఏకంగా రూ. 2 కోట్లకు పైగా ఉండచ్చని సమాచారం. ఓ రిపోర్ట్ ప్రకారం, బ్రహ్మానందం ఒక్కో సినిమాకి 1 నుండి 2 కోట్ల రూపాయల వరకు, వాణిజ్య ప్రకటనలకు దాదాపు కోటి వరకు వసూలు చేస్తారంట. అందుకే ఆయన భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హాస్యనటుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. 67 ఏళ్ల తెలుగు హాస్యనటుడు-బ్రహ్మానందం ఇప్పటి వరకు 1000 కంటే ఎక్కువ చిత్రాలలో కనిపించినందున అత్యధిక సినిమాలు చేసిన హాస్యనటుడిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నెలకొల్పాడు.