యశ్ కొత్త సినిమాకు ఊహించని టైటిల్ ..!!

Anilkumar
సుమారు ఏడాదిన్నరగా యశ్ కొత్త సినిమా అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఇన్ని రోజుల సైలెన్స్ కి తెరతీస్తూ యశ్ తన కొత్త సినిమాని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకి 'టాక్సిక్' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఖరారు చేశారు. 'ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్స్ అప్స్' అనేది ట్యాగ్ లైన్. గీతూ మోహన్ దాస్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదలైన గ్లిమ్స్ వీడియోని గమనిస్తే.. టైటిల్ అనౌన్స్మెంట్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. ఏప్రిల్ 10 2025న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు గ్లిమ్స్ వీడియోలో పేర్కొన్నారు. 

అంతేకాకుండా ఈ ఇందులో ఓ జోకర్‌ సింబల్‌ని బాగా ఎస్టాబ్లిష్‌ చేయడంతో అది కాస్త సినిమాపై ఆసక్తిని పెంచేసింది. దానికి తోడూ ఇందులో యష్‌ పాత్ర కి సంబంధించిన గెటప్‌ని సైతం చూపించడం విశేషం. ఆ గెటప్ అచ్చు కేజీఎఫ్‌ గెటప్ లాగే ఉంది. కేజీఎఫ్‌ సినిమాలోని యష్‌ పాత్ర ఐకానిక్‌ గెటప్‌ని తలపించేలా ఉండటం ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేస్తుంది. దీంతో ఈ ప్రాజెక్టు కూడా గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ లోనే ఉండబోతుందనే సందేహాలకు దారితీసింది. మొత్తం మీద అనౌన్స్మెంట్ వీడియో తోనే సినిమాపై ఒక రేంజ్ లో ఆసక్తిని పెంచేశారు మేకర్స్. ఇక సినిమా గురించి దర్శకురాలు గీత మోహన్ దాస్ మాట్లాడుతూ 

‘‘కథను సరికొత్తగా చెప్పాలని నేనెప్పుడూ ప్రయోగాలు చేస్తుంటాను. లైయర్స్, మూతోన్ వంటి సినిమాలను రూపొందించినప్పుడు వాటికి అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కాయి. నా దేశంలో నా ఆడియెన్స్ ఇలాంటి డిఫ‌రెంట్ నెరేష‌న్‌ను ఎలా రిసీవ్ చేసుకుంటార‌నే విష‌యాన్ని తెలుసుకోవ‌టానికి ఎప్పుడూ త‌హ‌త‌హ‌లాడుతుంటాను. అలాంటి ఆలోచ‌న‌ల నుంచి పుట్టిందే ఈ సినిమా. రెండు వేర్వేరు ప్రపంచాల క‌ల‌యిక‌గా క‌థ ఉంటుంది. ఈ క్ర‌మంలో నేను య‌ష్‌ను క‌నుగొన్నాను. త‌నొక అద్భుత‌మైన వ్య‌క్తి. నేను అలాంటి వ్య‌క్తిని చూడ‌లేదు. అత‌నితో క‌లిసి ఈ మ్యాజిక‌ల్ జ‌ర్నీని చేయ‌టానికి ఎంతో ఆతృత‌గా ఉన్నాను’’అని చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: