సందీప్ రెడ్డి గంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటించిన యానిమల్ మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అమితాబచ్చన్ హోస్ట్ చేస్తున్న 'కౌన్ బనేగా కరోడ్పతి' షోలో రష్మిక మందన ప్రస్తావన వచ్చింది. తాజా ఎపిసోడ్ లో మహారాష్ట్రకు చెందిన ప్రమోద్ బాస్కె అనే కంటెస్టెంట్ బిగ్ బి తో గేమ్ ఆడేందుకు వచ్చారు.
గేమ్ లో భాగంగా ప్రమోద్, 'సార్ మీరు నా హాబీస్ గురించి అడగలేదు?' అంటూ అమితాబ్ తో చెప్పాడు. దాంతో 'నీ హాబీస్ ఏంటి?' అంటూ బిగ్ బీ అడిగారు."నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సినిమాలు చూస్తాను. ముఖ్యంగా సౌత్ మూవీస్ అంటే చాలా ఇష్టం.
నేను రష్మిక మందన కి చాలా పెద్ద అభిమానిని. నాలాంటి అభిమాని ఆమెకు మరొకరు ఉండరు. ఆమె ఫస్ట్ మూవీ కిరిక్ పార్టీ 2016 లో రిలీజ్ అయింది. అప్పటినుంచి ఆమెకు అభిమానిగా మారాను. ఈ సందర్భంగా మీకో ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. సోషల్ మీడియాలో నేను రష్మిక నుంచి మూడుసార్లు రిప్లై అందుకున్నాను. ఆమెకు ప్రపోజ్ కూడా చేశాను" అని ఆ కంటెస్టెంట్ అమితాబ్ తో చెప్పుకొచ్చాడు.
దానికి అమితాబ్ 'మరి ఈ మధ్య ఏమైనా రష్మికతో మాట్లాడావా?' అని అడిగితే..' లేదు సార్ ఆమె ప్రమోషన్స్ తో చాలా బిజీగా ఉంది. నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పింది' అని అన్నాడు. ఎప్పుడైనా మీట్ అయ్యావా? అని అమితాబ్ అడిగితే.." లేదు సార్ నేను ఎప్పుడూ
ఆమెను మీట్ అవ్వలేదు. కనీసం ఒక్కసారైనా మీట్ అవ్వాలని అనుకుంటున్నాను" అని ఆ కంటెస్టెంట్ అన్నాడు. దాంతో అమితాబ్ షోలోనే రష్మికకి వీడియో కాల్ కనెక్ట్ చేసి.." నీ డై హార్ట్ ఫ్యాన్ ప్రమోద్ నా ముందు కూర్చున్నాడు. అతనితో మాట్లాడు" అని చెప్పాడు. దాంతో సదరు కంటెస్టెంట్ వీడియో కాల్ లో రష్మికని చూసి ఎంతో ఎగ్జైట్ అయ్యాడు." మీరంటే నాకు చాలా ఇష్టం మేడం. అని అన్నాడు. అందుకు రష్మిక బదులిస్తూ.." కచ్చితంగా నిన్ను ఒకరోజు డైరెక్ట్ గా కలుస్తాను. ఆల్ ది వెరీ బెస్ట్. నువ్వు చాలా బాగా ఆడుతున్నావ్. నిన్ను చూసి గర్వపడుతున్నాను" అని చెప్పింది. ఆ తర్వాత రష్మికకు థాంక్స్ చెబుతూ అమితాబచ్చన్.." నీ లేటెస్ట్ ఫిలిం యానిమల్ అమేజింగ్. సినిమాలో నీ పర్ఫామెన్స్ చాలా బాగుంది. ఫెంటాస్టిక్. దీని గురించి కచ్చితంగా మనం ఓ రోజు కూర్చొని మాట్లాడదాం" అంటూ యానిమల్ మూవీలో రష్మిక పర్ఫామెన్స్ పై పొగడ్తలు కురిపించాడు.