'పుష్ప 2' షూటింగ్ కి రెడీ అయిన రష్మిక ..!!

Anilkumar
యానిమల్ మూవీలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది రష్మిక. దాంతో ఈ హీరోయిన్ కి మరోసారి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్ గానే ఓ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్టుకి సైన్ చేసింది ఈ ముద్దుగుమ్మ. 'ది గర్ల్ ఫ్రెండ్' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్లో పాల్గొంటుంది. ఓవైపు యానిమల్ సక్సెస్ తో సెలబ్రేషన్ మోడ్ లో ఉన్న ఈ బ్యూటీ మరోవైపు వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతూ బిజీబిజీగా గడిపేస్తోంది. ప్రజెంట్ గర్ల్ ఫ్రెండ్ షూటింగ్ లో పాల్గొంటున్న రష్మిక త్వరలోనే పుష్ప2 సెట్స్ లో అడుగుపెట్టనుంది. 

అందుకు సంబంధించిన తాజా అప్డేట్ బయటకు వచ్చింది. ఇన్ని రోజులు యానిమల్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న రష్మిక ఇప్పుడు పుష్ప 2 షూటింగ్ కి రెడీ అయింది. డిసెంబర్ 13 నుంచి రష్మిక పుష్ప 2 షూటింగ్ లో జాయిన్ కానుంది. యానిమల్ మూవీలో గీతాంజలి గా మెప్పించిన ఈ బ్యూటీ ఇప్పుడు శ్రీవల్లిగా మారి పుష్ప 2 షూటింగ్ తో బిజీ కాబోతోంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన పుష్ప: ది రైజ్ ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ సక్సెస్ అవ్వడంతో దానికి సీక్వెల్ గా రాబోతున్న 

'పుష్ప 2' పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మూవీ టీం కూడా అందుకు తగ్గట్లే ప్లాన్ చేస్తున్నారు. సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. రీసెంట్ గానే జాతర సాంగ్ ని షూట్ చేశారు. ఇక డిసెంబర్ 13 నుంచి బన్నీ, రష్మికపై పలు సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. కాగా పుష్ప ది రైజ్ లో అల్లు అర్జున్ నటనకు గాను నేషనల్ అవార్డు రావడంతో పుష్ప 2 మూవీని పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అన్ని ప్రాంతీయ భాషలతో పాటు చైనా, జపాన్, రష్యా వంటి దేశాల్లోనూ విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: