ఆ విషయంలో మాజీ మామ, అల్లుడికి మళ్లీ మొదలైన గొడవ..!?

Anilkumar
స్టార్ హీరో ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ కెప్టెన్ మిల్లర్. ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ను అరుణ్ మాదేశ్వరన్ తెరకెక్కించారు. నివేదిత సతీష్ జాన్ సురేష్ కుమార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాను సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం తర్వాత పనులను శరవేగంగా జరుపుకుంటుంది. కాగా సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు నిర్మాతలు. అయితే అదే సమయంలో రజినీకాంత్


నటించిన  సినిమా కూడా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. తలైవర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కూడా సంక్రాంతి రేసులో ఉంది. కాగా ఈ సినిమా ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో వస్తున్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. రజినీకాంత్  సినిమాతో ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమా కూడా డిసెంబర్ నెలలోనే విడుదల చేస్తున్నారు అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు అభిమానులు. అయితే తాజాగా ఈ విషయంపై ప్రొడ్యూసర్స్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. కెప్టెన్ మిల్లర్ సినిమాని ముందుగా నిర్ణయించిన


తేదీ ప్రకారం సంక్రాంతి కానుకగా విడుదల చేస్తాము అని వెల్లడించారు. దీంతో సంక్రాంతికి మాజీ మామ, అల్లుళ్ళ మధ్య వార్ తప్పట్లేదు. అదే విధంగా ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ సినిమా టీజర్, పాటలు ఇప్పటికే రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో రెండు సినిమాలు ప్రేక్షకులు ఇచ్చే రిజల్ట్ ఎలా ఉండబోతుందని ఆసక్తి సినీవర్గాలతో పాటు ఇరు హీరో వర్గాల ఫ్యాన్స్ కి కూడా మొదలైంది. కెప్టెన్ మిలర్‌ 2024 జనవరి 15న రిలీజ్ కాబోతుంది. లాల్ సలాం సంక్రాంతికి విడుదల చేస్తారని ప్రకటించారు.. కానీ డేట్ పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: