ఏంటి.. వరుణ్, లావణ్య ల మధ్య ప్రేమ పుట్టడానికి కారణం ఆ స్టార్ హీరోయినా..!?

Anilkumar
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. దాదాపుగా 7 సంవత్సరాలు ప్రేమలో ఉన్న ఈ జంట ఇటీవల వివాహం చేసుకొని ఒకటయ్యారు. నవంబర్ 1వ తేదీన ఘనంగా వివాహం చేసుకొని మెగా కోడలుగా ఎంట్రీ ఇచ్చింది లావణ్య త్రిపాఠి. అయితే ఈ ప్రస్తుతం ఈ జంట హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరిద్దరికి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అది ఏంటంటే వరుణ్ తేజ లావణ్య త్రిపాఠిల మధ్య ప్రేమ పుట్టడానికి 

ఒక స్టార్ హీరోయిన్ కారణం అన్న వార్తలు వినబడుతున్నాయి. ఆ స్టార్ హీరోయిన్ సమంత. అవును సమంత వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టడానికి కారణం అని అంటున్నారు. దానికి ప్రధాన కారణం వరుణ్ తో ఆమె చేయాల్సిన సినిమా మిస్ అవ్వడమే. వరుణ్ తేజ్ లావణ్య కలిసి మొదటిసారిగా నటించిన సినిమా మిస్టర్. ఇక ఈ సినిమా కంటే ముందు వీరిద్దరూ ఒకరికొకరు అస్సలు పరిచయం లేదు. ఇక ఈ సినిమాలో నటించడం ద్వారా వీరు ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కారుస్త కొద్దిరోజుల తర్వాత ప్రేమగా మారింది. ఇప్పుడు భార్యాభర్తలు గా మారిపోయారు .

అయితే ఈ సినిమాలో ముందుగా హీరోయిన్గా సమంతను అనుకున్నారట డైరెక్టర్ . ఆమె రిజెక్ట్ చేయడంతోనే ఆ పాత్ర లావణ్య కు వెళ్ళింది . అలా పరోక్షకంగా తనకు తెలియకుండా హీరోయిన్ సమంతనే వరుణ్ లావణ్య ప్రేమకు పెళ్లికి కారణమైంది అనమాట.  మొత్తానికి పరోక్షంగా వీరిద్దరి పెళ్లికి సమంత కారణ మైందన్నమాట. దీంతో ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక సమంత విషయానికి వస్తే కృషి సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సమంత సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చింది. అలా బ్రేక్ ఇచ్చిన సమంత కొద్ది రోజులు వేకేషన్ ఎంజాయ్ చేసింది. మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ చేరుకుంది.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: