ట్విట్టర్ నుంచి సమంత వాకౌట్ అయ్యిందా..!!

Divya
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా చలామణి అవుతున్న హీరోయిన్లలో సమంత కూడా ఒకరు.. దాదాపుగా ఎన్నో సంవత్సరాలుగా స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటుంది. ఎన్నో అద్భుతమైన సినిమాలలో కూడా నటించిన సమంత ఇటీవల కాలంలో మయోసైటీస్ వ్యాధిన గురి కావడంతో ఆ వ్యాధి నుంచి కోలుకోవడానికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. విదేశాలకు కూడ వెళ్లడం జరిగింది..అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సమంత అప్పుడప్పుడు అభిమానులతో ఇంస్టాగ్రామ్ లో పంచుకుంటూనే ఉంటుంది. ముఖ్యంగా నాగచైతన్య తో విడిపోయినప్పటి నుంచి సమంతా కు పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు.

గతంలో సమంత ఎలాంటి విషయాన్ని అయినా సరే ఎక్కువగా ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ ఉండేది.. ఈ ఏడాది ఏప్రిల్ వరకు చలాకీగా ట్విట్టర్లో ఉన్న సమంత ఆ తర్వాత ట్విట్టర్ నుంచి ఎలాంటి పోస్ట్ చేయలేదు. ముఖ్యంగా తన కొత్త ప్రొడక్షన్ హౌస్ కోసం కూడా ఆమె కేవలం తన ఇంస్టాగ్రామ్ లో మాత్రమే అప్డేట్ ఇస్తూ ఉన్నది. సమంత ట్విట్టర్ నుంచి దూరమయిందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.. అయితే ఇందుకు ముఖ్య కారణం ట్రోలింగ్ దారుణమైన కామెంట్స్ చేయడం వంటివి అన్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.

గతంలో కూడా హీరోయిన్ రాశి ఖన్నా పైన కూడా ఇలాంటి అసభ్యకరమైన వ్యాఖ్యలు రెచ్చగొట్టే ప్రకటనలు రావడంతో ఆమె ట్విట్టర్ నుంచి వాకౌట్ అవ్వడం జరిగింది..  సమంత నాగచైతన్య తో విడాకులు ప్రకటించినప్పటి నుంచి ఈమె పైన చాలా దారుణంగా ట్రోల్స్ వినిపిస్తూ ఉండేవి.. అంతేకాకుండా సమంత పైన నీచాతి నీచంగా కామెంట్స్ చేస్తూ ఉండడంతో పాటు పలు రకాల రూమర్స్ కూడా వినిపిస్తూ ఉండడంతో సమంత ట్విట్టర్ నుంచి దూరంగా ఉన్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలన్నిటికీ చెక్ పెట్టే విధంగా సమంత ట్విట్టర్లో ఏదైనా పోస్ట్ చేస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: